Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, అదే సమయంలో వాళ్ళ మధ్య బిగ్ బాస్ నిర్వహించే ఆసక్తికరమైన టాస్కులు, ఇలా ప్రతీ ఒక్కటి ఈ సీజన్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ని తీసుకొస్తుంది. గత సీజన్ కూడా ఇలాగే సాగింది కానీ, నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్ లో ఆశించిన స్థాయిలో హోస్టింగ్ చేయకపోవడం, షోని ఒక క్రమమైన పద్దతిలో తీసుకొని రావడంలో విఫలం అవ్వడం కారణంగా ఆ సీజన్ యావరేజ్ రేంజ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఈ సీజన్ లో ఆయన హోస్టింగ్ రెండు వారాలు అదిరిపోయింది. కంటెస్టెంట్స్ చేసే తప్పులను ఎత్తిచూపుతూ కడిగిపారేస్తూ ఈ సీజన్ ని బ్లాక్ బస్టర్ వైపు నడిపిస్తున్నాడు నాగార్జున.
ఇకపోతే ఇప్పటి వరకు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ నుండి శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. 5 వ వారం వచ్చేలోపు హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే మిగులుతారు. ఇక ఆ తర్వాత 5వ వీకెండ్ లో జరిగే గ్రాండ్ లాంగ్ ఎపిసోడ్ లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. వారిలో సెలబ్రిటీలు ఉన్నారు, కామనర్స ఉన్నారు మరియు పాత సీజన్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు పాత సీజన్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వారిలో పృథ్వీ రాజ్ శెట్టి కూడా ఉన్నాడు. ఈయన గత సీజన్ లో 12 వారాలు కొనసాగాడు. విష్ణు ప్రియా కారణంగా కాస్త నెగిటివ్ అయ్యి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది కానీ, లేదంటే ఈయన టాప్ 5 రేంజ్ కంటెస్టెంట్. ఇప్పుడు ఆయన్ని బిగ్ బాస్ టీం సంప్రదించింది అంట.
అదే విధంగా పల్లవి ప్రశాంత్ ని కూడా సంప్రదించినట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిల్చిన ఈయన ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగానే ఉన్నాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే సీజన్ 7 లో ఈయన టైటిల్ గెలవడానికి ముఖ్య కారణం శివాజీ. ఆయన ప్రశాంత్ లోని ఒరిజినల్ యాంగిల్ ని సాధారణమైనంత వరకు బయటకు రానివ్వకుండా చూసాడు. ఆ కారణం చేతనే ప్రశాంత్ టైటిల్ గెలిచాడు అనేది అందరి అభిప్రాయం. మరి ఈసారి శివాజీ లేడు, మనోడి సత్తా ఎంత వరకు ఉంటుందో చూడాలి. ఇక సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తున్న మరో పాత సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. సీజన్ 7 టాప్ 5 గా నిల్చిన ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.