HomeతెలంగాణMLC Kavitha: కవిత కారాగారవాసం ఇంకెన్నాళ్లు.. విముక్తి రాదా?

MLC Kavitha: కవిత కారాగారవాసం ఇంకెన్నాళ్లు.. విముక్తి రాదా?

MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో చిక్కుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈడీ విచారణకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈడీ తన జోలికి రాదనుకుంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత మార్చి 15వ తేదీన ఈడీ డైరెక్టుగా కవిత ఇంటికే వచ్చి షాక్‌ ఇచ్చింది. ఇంట్లో సోదాలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఢిల్లీ తీసుకెళ్లి కోర్టు ఆదేశాలతో తీహార్‌ జైలుకు తరలించింది.

నాలుగు నెలలుగా జైల్లో..
కోర్టు ఆదేశాలతో కవిత నాలుగు నెలలుగా తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం ఆమె ప్రత్యక కోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, దర్యాప్తు సంస్థల వాదనతో ఏకీభవించిన కోర్టులు ఆమెకు బెయిల్‌ నిరాకరించాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులోనే అరెస్ట్‌ అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల సమయంలో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఎన్నికల ప్రచారం తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు. కవితకు మాత్రం కారాగార వాసం నుంచి విముక్తి కలగడం లేదు.

బెయిల్‌ ఆశలు ఆవిరి..
ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీహార్‌ జైల్లో కవితతో ములాఖత్‌ అయ్యారు. తర్వాత మాట్లాడుతూ త్వరలోనే కవిత కేసుల నుంచి బయట పడతారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అవుతారని ప్రకటించారు. కానీ, కవిత బెయిల్‌ ఆశలు మళ్లీ ఆవిరయ్యాయి. రెండు రోజుల క్రితం బెయిల్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ నిరాకరించింది. మరోవైపు కవిత కస్టడీ ముగియడంతో వర్చువల్‌గా ఆమెను కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణ నిర్వహించిన కోర్టు కస్టడీని జూలై 25 వరక పొడిగించింది. దీంతో కవితకు నిరాశ తప్పలేదు.

కేసీఆర్‌ కుటుంబానికి అరెస్టుల భయం..
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ కుటుంబాన్ని ఇంకోవైపు అరెస్టుల భయం వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వం ప్రాజెక్టులో అక్రమాలు, విద్యుత కొనుగోలు ఒప్పందాల్లో అవకతకవలపై రిటైర్డు జడ్జీలతో కమిషన్‌ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఇంకోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌తోపాటు, కేటీఆర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ సంస్థలు కేసీఆర్‌ కుటుంబంలో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తాయో అనే ఆందోళన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version