Rajamouli-Mahesh: రాజమౌళి మహేష్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అంటే.?

Rajamouli-Mahesh: మొదటి సినిమా హీరో ను ఇచ్చిన, లేదా 100 సినిమాలు చేసిన హీరోని ఇచ్చిన కూడా వాళ్ళ ఇమేజ్ ఎలా ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ వారి నుంచి ఏం కోరుకుంటున్నారు

Written By: Gopi, Updated On : July 4, 2024 10:38 am

When will Rajamouli Mahesh movie start

Follow us on

Rajamouli-Mahesh: ఒక సినిమాను సూపర్ సక్సెస్ చెయ్యాలి అంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి. ముఖ్యంగా దర్శకుడికి సినిమాని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. అలాగే ఆ హీరో తాలూకు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ల ఫ్యాన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారో అలాంటి ఎలిమెంట్స్ ను సినిమాలో ఇన్వాల్వ్ చేస్తు సక్సెస్ చేయగలిగే సత్తా ఉండాలి. ఇక ఇలాంటివన్నీ ఉన్న ఏకైక దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి.

ఆయనకు మొదటి సినిమా హీరో ను ఇచ్చిన, లేదా 100 సినిమాలు చేసిన హీరోని ఇచ్చిన కూడా వాళ్ళ ఇమేజ్ ఎలా ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ వారి నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది క్లారిటీ గా తెలుసుకొని దానికి అనుకూలంగానే సినిమా చేసి సక్సెస్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం… నిజానికి రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఎస్ ఎస్ ఎం బి 29 (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లోనే ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. అలాగే ఈ సినిమాని వరల్డ్ లోనే ది బెస్ట్ సినిమా గా నిలిపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం మీద అందరిలో చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సినిమాని రాజమౌళి తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకురాబోతున్నాడనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటిదాకా సెట్స్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి సెప్టెంబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్ళింది అంటే ఆ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ ను కంప్లీట్ చేసుకునే విధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే అటు మహేష్ బాబు, ఇటు రాజమౌళి అభిమానులు ఈ వార్త తెలుసుకున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పాలి…