spot_img
Homeటాప్ స్టోరీస్Kalvakuntla Kavitha New Party Plans: టీఆర్ఎస్ కు ఎసరు పెట్టిన కవిత.. కష్టమేఇక

Kalvakuntla Kavitha New Party Plans: టీఆర్ఎస్ కు ఎసరు పెట్టిన కవిత.. కష్టమేఇక

Kalvakuntla Kavitha New Party Plans: తెలంగాణ రాజకీయాలు ఇప్పటివరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా సాగాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి కల్వకుంట్ల కవిత చేరిపోయారు. గులాబీ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆమె.. తన రాజకీయ ప్రయాణాన్ని బలోపేతం చేసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇందులో కొన్ని విజయవంతం అయ్యాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని కల్వకుంట్ల కవిత చేపట్టిన కార్యక్రమాలు మైలేజ్ ఇచ్చాయి. అందువల్లే ఆమె రాజకీయ పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజకీయ పార్టీ పేరును ప్రకటించే విషయంలో కవిత చాలా వ్యూహాత్మక ధోరణి ప్రదర్శిస్తున్నారు. మొదట్లో తెలంగాణ జాగృతి అని.. ఆ తర్వాత జాగృతి తెలంగాణ అని ప్రచారం జరిగినప్పటికీ పార్టీ పేరు విషయంలో కవిత ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం కల్వకుంట్ల కవిత తన తండ్రి ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మీద కన్ను వేశారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు స్వేచ్ఛా జాబితాలోకి వచ్చిందని.. దాన్ని ఎవరైనా వాడుకునే అవకాశం ఉందని కవిత స్పష్టం చేశారు. తను ఏర్పాటు చేయబోయే పార్టీ కచ్చితంగా జయశంకర్ ఆశయాల ఆధారంగా సాగుతుందని కవిత స్పష్టం చేశారు. అనేక రకాలైన ఏజెండాలతో తమ పార్టీ ప్రజల ముందుకు వస్తుందని ప్రకటించారు. అయితే భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన పేరును కవిత వాడుకుంటే కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని నాయకులు అంటున్నారు.

ఇటీవల కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. తెలంగాణ ప్రజల సమస్యలను గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ.. సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారానికి గురికాలేదని.. ఇచ్చిన హామీలు అమలు కాలేదని.. కేవలం కొన్ని విషయాలలో మాత్రమే సానుకూల ఫలితాలు కవిత స్పష్టం చేశారు. తన తండ్రి పరిపాలనపై ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా తన తండ్రి స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఆమె వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై గులాబీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు.. ఒకవేళ ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి పేరును వాడుకోకుండా ఏవైనా అడ్డంకులు సృష్టిస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version