Kavitha BC Deeksha: అప్పుడెప్పుడో నిజామాబాదు పార్లమెంటు స్థానంలో పోటీ చేసినప్పుడు కల్వకుంట్ల కవిత తన అత్తమామలు దేవనపల్లి రామ్ కిషన్ రావు, నవలత ఆశీర్వాదం తీసుకున్నారు. అత్తగారింట్లో ఉన్న హనుమంతుడి విగ్రహానికి పూజలు చేశారు.. ఆ తర్వాత రామ్ కిషన్ రావు, నవలత ఆశీర్వాదం కవిత తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా మీడియాలో కనిపించలేదు. ప్రతి సందర్భంలోనూ కవిత తన తల్లిదండ్రి ఆశీర్వాదం మాత్రమే తీసుకునేవారు. వారిని మాత్రమే కలిసేవారు. ఇప్పుడు ఒకప్పటి రోజులు కాదు కదా.. పైగా తన రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగా సాగిస్తోంది. దీనికి తోడు దయ్యాలు, లేఖలు, లీకులు.. ఇన్ని వ్యవహారాల మధ్య కవిత భారత రాష్ట్ర సమితి దూరమయ్యారు. చివరికి కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం జరిగినట్టు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత తాను నిర్వహిస్తున్న జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 72 గంటల పాటు దీక్షకు దిగారు.
Also Read: రేవంత్ ఆఫర్ : జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ను డిసైడ్ చేసేది చిరంజీవినే
కొంతకాలంగా బీసీల కోసం కవిత వివిధ రూపాలలో నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగ నియామకాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు న్యాయం చేయలేదు? అనే ప్రశ్న అడిగితే అప్పుడు తప్పు జరిగింది.. ఇప్పుడు దీనిని సరి చేయాల్సిన బాధ్యత రేవంత్ మీద ఉందని ఆమె మొహమాటం లేకుండా చెబుతున్నారు. తనకు ఎవరి నుంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ బీసీల తరఫున 72 గంటల పాటు దీక్షకు ఆమె సంకల్పించారు. జాగృతి ఆధ్వర్యంలో ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Also Read: మంత్రిగారి ఫోన్ పోయింది.. చివరికి ఎక్కడ దొరికిందంటే..
పార్టీకి కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్న ఆమెకు.. కుటుంబం నుంచి కూడా సపోర్టు దక్కినట్టు కనిపించడం లేదు. దీంతో ఒంటరిగానే ఆమె బీసీ దీక్ష చేస్తున్నారు. దీక్షలో జాగృతి నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో జాగృతి కార్యక్రమాలను వేగవంతం చేసిన ఆమె.. తనకంటూ సొంత రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్న నాయకురాలిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కవిత ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుంది? కవిత దీక్ష ధాటికి రేవంత్ దిగివచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. అంటే నిండు శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. ఒక బిల్లును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. గవర్నర్ కేంద్రంతో చర్చలు జరిపారు కానీ.. బిల్లు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఆ బిల్లు కోల్డ్ స్టోరేజ్ లో ఉంది. ఆమధ్య బీసీల కోసం 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కవిత అభినందించారు. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. కవిత మాత్రం అభినందించడం విశేషం. అంతేకాదు తన దారిలోనే పింక్ పార్టీ కార్యకర్తలు కూడా రావాలని చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఆమె బీసీల కోసం దీక్ష చేస్తున్నారు.. చూడబోతే కవిత ఒంటరిగానే తన రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో..
https://x.com/bigtvtelugu/status/1952247228816601487