Dhee 20 Latest Episode: దాదాపుగా 20 ఏళ్ళ నుండి బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన ‘ఢీ'(Dhee Show) షో, ప్రస్తుతం 20 వ సీజన్ ని జరుపుకుంటుంది. గత సీజన్ కి టీఆర్ఫీ రేటింగ్స్ పెద్దగా రాలేదు. అందుకే ఈ సీజన్ అదిరిపోవాలనే ఉద్దేశ్యంతో పాత సీజన్స్ కి సంబంధించిన బెస్ట్ డ్యాన్సర్స్ అందరినీ ఈ సీజన్ లోకి తీసుకొచ్చారు. వీళ్ళ మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు,ఎవరికీ వారు తమ స్టైల్ లో దుమ్ము లేపేస్తున్నారు. ప్రారంభం ఎపిసోడ్స్ నే ఈ రేంజ్ లో ఉన్నాయంటే ఇక భవిష్యత్తులో రాబోయే ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. గత ఎపిసోడ్ లో పండు వేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ఇక ఈ వారం ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్స్ కూడా మంచి ఫైర్ మీద ఉన్నాయని ప్రోమో ని చూస్తేనే అర్థం అవుతుంది.
Also Read: ఈ ఏజ్ లో రజినీకాంత్ హీరోగా సినిమాలు చేయడం కరెక్టేనా..?
ఈ ప్రోమో లో ఒక ముసలి తాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పాటకు కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ వేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. అవేమి స్టెప్పులు, అదేమీ స్పీడ్, అదేమీ గ్రేస్ బాబోయ్, కుర్రోళ్ళు కూడా ఈ రేంజ్ లో డ్యాన్స్ వెయ్యలేరు కదా?, చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేయడం అంత తేలికైన విషయం కాదు, అంత సాహసం కూడా ఎవ్వరూ చెయ్యరు, కానీ ఈ తాత చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేయడమే కాదు, ఒకానొక సందర్భం లో ఆయన్ని దాటేశాడు కూడా. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ తాత గురించే చర్చ. అసలు ఎక్కడి నుండి వచ్చాడు రా బాబు ఈయన, ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంత మంది ఉన్నారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Megastar doesn’t just have fans — he commands generations.
Age is powerless
when hearts beat for him❤️ . @KChiruTweets ❤️❤️❤️#MegaStarChiranjeevi pic.twitter.com/ec58FQXV6F— Ashwatthama (@Ashwatthama2898) August 3, 2025