Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణలో బీఆర్‌ఎప్ అధికారంలో ఉన్న పదేళ్లు ఓ వెలుగు వెలిగారు. లిక్కర్ స్కాంతో ఇంకా ఫేమస్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయిన కవిత.. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ.. జాగృతి సంస్థ ద్వారా జనం బాట పట్టారు. ఈ క్రమంలో పార్టీ నేతలపై విమర్శలు కొనసాగిస్తున్నారు. తాజాగా తనను తన కుటుంబం నుంచి వేరు చేయడానికే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని కవిత తెలిపారు. కానీ ప్రజా కుటుంబం నుంచి ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు.
కుటుంబ సంబంధాలను దెబ్బతీయాలని..
కొంతమంది పార్టీలోని వ్యక్తులు తమ స్వార్థాల కోసం తనను పార్టీ నుంచి తొలించేలా చేశారని కవిత ఆరోపించారు. తల్లిదండ్రుల నుండి దూరం చేశారని పేర్కొన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు తన పిల్లల కంటే తల్లి గురించే ఎక్కువ ఆలోచించానని, ఇప్పుడు కుటుంబ సహాయం లేకుండా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రజలే మరో కుటుంబం..
ఇక తెలంగాణ ప్రజలు తనకు మరో కుటుంబం అన్నారు. మరో కుటుంబం కోసం పోరాడుతానని తెలిపారు. హరీష్ రావు, సంతోష్ కుమార్‌లు పార్టీ నేతృత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానని తనను తొలగించారని పేర్కొన్నారు. పార్టీలో అవినీతి, కుటుంబ శత్రుత్వాలు ఉన్నాయని విమర్శించారు. ఇకపై తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి స్వతంత్ర పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది.
“నన్ను కుటుంబం నుండి దూరం చెయ్యాలనే కుట్రలో భాగంగా పార్టీ నుండి దూరం చేసారు.
నా మరో కుటుంబం తెలంగాణ కోసమే పని చేస్తున్నా.”
– #Kavitha pic.twitter.com/B8AtgKHcIS
— Gulte (@GulteOfficial) November 28, 2025