MS Dhoni And Virat Kohli: కోట్లల్లో అభిమానులు.. అంతకు మించిన స్థాయిలో ఒప్పందాలు.. వేల పరుగులు.. పదులకొద్దీ సెంచరీలు.. అద్భుతమైన విజయాలు.. చిరస్మరణీయమైన జ్ఞాపకాలు.. వెలకట్టలేని ట్రోఫీలు.. విరాట్ కోహ్లీ, ధోని గురించి ప్రస్తావన వస్తే పైవన్నీ మదిలో మెదులుతుంటాయి. వీరిద్దరూ క్రికెట్లో ఎన్ని సంచలనాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమకాలీన క్రికెట్లో వీరు వేసిన ముద్ర మామూలుది కాదు.. వీరిద్దరూ కలిశారంటే మైదానంలో పరుగుల వరద పారుతుంది.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ధోని టీమిండియా కు గుడ్ బై చెప్పేసాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ధోని, విరాట్ కలిశారు అంటే అభిమానులకు పండగే పండుగ.. వాస్తవానికి వీరిద్దరు కేవలం ఐపిఎల్ మ్యాచ్ల సందర్భంగా మాత్రమే కలుస్తున్నారు.. ప్రొఫెషనల్ లైఫ్ లో ఎవరి బిజీ వారిదే. టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వన్డేలలో తలపడుతోంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రాంచి వేదికగా టీమిండియా దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ ఆడబోతోంది.. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు రాంచి చేరుకున్నారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. రాంచి ధోనీకి సొంత ప్రాంతం. రాంచీలో ధోనికి వ్యవసాయ క్షేత్రం, అధునాతన వసతులు ఉన్న గృహం ఉంది.. ధోని క్రికెటర్ మాత్రమే కాదు, అద్భుతమైన బైకర్ కూడా. ఇతడి వద్ద రేర్ గ్యారేజ్ ఉంది. అందులో అద్భుతమైన వాహనాల కలెక్షన్ ఉంది.
రాంచికి టీమిండియా ప్లేయర్లు రావడంతో ధోని వారందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు.. వారికి విందు ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఇంట్లో ఉన్న వాహనాల గ్యారేజ్ ను ధోని చూపించాడు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. విరాట్ కో హ్లీ ధోని గ్యారేజీ లో ఉన్న వాహనాలను చూస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు లక్షలలో లైక్స్, అదే స్థాయిలో వీక్షణలు నమోదయ్యాయి. ధోని, విరాట్ పిచ్చాపాటిగా మాట్లాడుకున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
తన ఇంటికి వచ్చిన టీమ్ ఇండియా ప్లేయర్లకు ధోని అద్భుతమైన విందుఇచ్చాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాంచీ ప్రాంతంలో ఫేమస్ వంటకాలను టీమిండియా ప్లేయర్లకు కొసరి కొసరి ధోని వడ్డించినట్టు తెలుస్తోంది. ధోని ఆతిథ్యానికి టీమిండియా ప్లేయర్లు ఫిదా అయ్యారని.. ధోని ఆతిధ్యాన్ని తమ మర్చిపోలేని ప్లేయర్లు చెప్పారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.