Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఎన్నికలు జరిగి ఏడాది కావసొస్తున్నా రాజకీయాలు ఆగడం లేదు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి అని చెప్పే నేతలు కూడా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పది నెలలుగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో చేతల వరకు కూడా వెళ్లింది. రాజకీయాలు ఇలా నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న సమయంలో రాష్ట్ర అర్థిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ అభివృద్ధి గురించి అధ్యయనం కోసం దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్లిన మంత్రి పర్యటన ముగించుకుని తెలంగాణకు వచ్చే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళికి ముదే.. తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలతాయని ప్రకటించారు. పరోక్షంగా అరెస్టులు ఉంటాయని తెలిపారు. కానీ.. దీపావళి పండుగ రానే వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద బాంబులు ఏవీ పేలలేదు. జన్వాడా ఫామ్‌హౌస్‌లో పార్టీ.. డ్రగ్స్ వినియోగం వంటి అంశాలతో ఓ బాంబు పేలినా అది పెద్దగా ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. ఈ తరుణంలో తాజాగా 36 గంటల థంబ్‌నెయిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబోయే 36 గంటల్లో తెలంగాణలో మరిన్ని బాంబులు పేలతాయని దీని అర్థం.
కక్ష సాధింపే…
తాజాగా పరిస్థితులు చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపునకే అధికార కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై విచారణ జరుపుతున్న ప్రభుత్వం దీనికి సబంధించిన అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ తుది దశకు చేరింది. అంతా కేసీఆర్, హరీశ్‌రావు చేశారని అధికారులు కమిషన్ ఎదుట చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ విచారణ జరుగుతోంది. దీనికి సబంధించిన సాక్షాలను కూడా ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సబంధించి కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇది కాకుంటే.. ధరణిలో అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు, గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల సాకుతో అరెస్టులు చేసే అవకాశం ఉంది. తమిళనాడు తరహాలోనే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కరుణానిధి, జయలలతి తరహాలో.. కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఒకరిపై ఒకరు కక్ష సాధించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాళేశ్వరం, డ్రగ్స్..
తాజా పరిస్థితులను బట్టి చూస్తే.. ఇటీవల బీఆర్‌ఎస్ బలమైన ప్రతిపక్షంగా ప్రజల్లో గుర్తింపు పొందుతోంది. రుణమాఫీ, రైతుభరోసా, ఆరు గ్యారంటీలు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తోంది. ఈ తరుణంలో ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలో భాగంగా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం, డ్రగ్స్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. పేలితే మొదటి ఇదే బాంబు పేలాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే జన్వాడ ఫాంహౌస్ తరహాలో 36 గంటల్లో పేలే బాంబులు కూడా తుస్సమంటాయన్న విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Just before diwali political bombs will explode in telangana says finance minister ponguleti srinivas reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com