Jubilee Hills By Election 2025: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణ మాత్రమే కాదు ఏపీ ప్రజలు కూడా ఈ ఎన్నికను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏపీ నుంచి వచ్చిన వారు అధికంగా ఉన్నారు.. అందువల్లే ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి? ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాల మీద తెలంగాణ వారి కంటే, ఏపీ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఏపీ నుంచి చాలామంది ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రాంతానికి వచ్చారు. అలాగని వారు సర్వే సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తులు కాదు. వారంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయడానికి ప్రధాన కారణం.. డబ్బు.. అలాగని వారికి ఇక్కడ ఓట్లు కూడా లేదు. ఇక్కడికి రావడానికి, క్షేత్రస్థాయిలో పర్యటించడానికి.. పార్టీల గురించి వాకబు చేయడానికి ప్రధానమైన కారణం ఒకటుంది.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో అనేక హోటల్స్.. లాడ్జిలలో చాలామంది దిగడానికి ప్రధాన కారణం బెట్టింగులు వేయడమే.. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ ఓడిపోతుంది? గెలిచే పార్టీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది? అనే అంశాల మీద బెట్టింగులు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద భారీగా బెట్టింగులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించే అవకాశాలు లేకపోలేదని.. ఆమె గెలుపు మీద కూడా భారీగా బెట్టింగులు నడుస్తున్నట్టు సమాచారం. అందువల్లే వారంతా కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొద్దిరోజులుగా తిష్ట వేసినట్టు తెలుస్తోంది.. ఓ అంచనా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం
లో జరుగుతున్న ఉప ఎన్నికలపై దాదాపు 300 నుంచి 400 కోట్ల వరకు బెట్టింగులు నడుస్తున్నట్టు తెలుస్తోంది.. కొంతమంది ప్రత్యేక ముఠాగా ఏర్పడి ఏ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈముఠా సభ్యులు ఎప్పటికప్పుడు సర్వే చేయించుకుని.. దాని ఆధారంగా బెట్టింగ్లు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో నేటితో ప్రచారం ముగుస్తుంది. మంగళవారం పోలింగ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది.. నేటి సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే దాకా ఇక్కడ వైన్ షాపులను బంద్ చేస్తారు. బయట వ్యక్తులను స్థానికంగా ఉండకుండా బయటికి పంపించేస్తారు.