https://oktelugu.com/

Journalists Are Happy With Revanth’s Decision: రేవంత్ నిర్ణయంతో జర్నలిస్టుల్లో ఆనందం.. ఆ నేతలనే ఫాలో అవుతున్న డైనమిక్ లీడర్

ముఖ్యమంత్రి బీట్ చూడడం అయినా.. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్లు కవర్ చేయడం అయినా.. ఏ జర్నలిస్టుకైనా ఎంతగానో ఇష్టం. ఎందుకంటే రాష్ట్ర పాలకుడితోనే పరిచయాలు ఏర్పడుతాయని ఆలోచన.

Written By:
  • Srinivas
  • , Updated On : November 9, 2024 / 02:49 PM IST

    Revanth-Reddy

    Follow us on

    Journalists Are Happy With Revanth’s Decision: ముఖ్యమంత్రి బీట్ చూడడం అయినా.. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్లు కవర్ చేయడం అయినా.. ఏ జర్నలిస్టుకైనా ఎంతగానో ఇష్టం. ఎందుకంటే రాష్ట్ర పాలకుడితోనే పరిచయాలు ఏర్పడుతాయని ఆలోచన. ఇక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయాలని ఏ జర్నలిస్టుకైనా కల అనే చెప్పాలి. కానీ.. కొందరు ముఖ్యమంత్రులు మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటే.. మరికొందరేమో శత్రుత్వంతో ఉంటారు. కొందరికి రాకరాక అవకాశం వస్తే దానిని మోనార్క్‌లా భావించి మీడియాను దూరం పెట్టిన వారినీ చూశాం. ఇక ఇంటర్వ్యూలు అంటే ఆమడదూరమే పెట్టేవారు.

    కానీ.. రేవంత్ తీరు మరొలా ఉంది. నిత్యం మీడియాతో సఖ్యతగా ఉంటూ.. మీడియా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు, వైఎస్సార్‌లు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. కానీ.. మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రి వాటిని అవాయిడ్ చేశారు. తామే మోనార్క్‌లమంటూ తన సొంత మీడియా వరకే ఇంటర్వ్యూలను పరిమితం చేశారు. అది కూడా ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే. కానీ.. చంద్రబాబు, వైఎస్సార్ లు మాత్రం ఎవరు అడిగినా ఇంటర్వ్యూలకు నో చెప్పే వారు కాదు. అయితే.. గత పదేళ్ల కాలంలో జర్నలిస్టులు కూడా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేయలేకపోయారు. దాంతో కొంత మంది కల అలాగే ఉండిపోయింది. సీఎంను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని జర్నలిస్టులు ఎదురుచూసేవారు.

    కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు, వైఎస్సార్‌లను చూసి రేవంత్ ఫాలో అవుతున్నారు. ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు స్వేచ్ఛగా జర్నలిస్టులు సీఎంను కలుస్తున్నారు. అలాగే నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా అడిగిన వారందరికీ రేవంత్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సెక్రటేరియట్‌లోనూ చాలా మంది జర్నలిస్టులు ముఖ్యమంత్రిని సులువుగా కలిశారు. దీంతో ఇప్పుడు జర్నలిస్టులంతా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు, వైఎస్ సీఎంలుగా ఉన్నప్పుడు వారిలో అహంకారం కానీ కాస్తైనా కనిపించకపోతుండే. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండే మీడియాతో మరింత దగ్గరగా ఉండేవారు. మీడియా యాజమాన్యాలతో సంబంధాలు ఉన్నా.. సెక్రటేరియట్ చూసే జర్నలిస్టులందరితోనూ వారు మంచి సంబంధాలనే కొనసాగించేవారు. కనీసం వారానికి ఒక ప్రెస్‌మీట్ అయినా పెడుతూ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చేవారు. అప్పటి జర్నలిస్టులకు సీఎంల ఇంటర్వ్యూలు చేయడం కూడా పెద్ద విషయం కాదు. కానీ.. మధ్యలో వచ్చిన సీఎంలు మాత్రమే వాటిని అవాయిడ్ చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ అయినా.. ఏపీలో జగన్ అయినా మీడియా ప్రతినిధులను పెద్దగా కలిసేవారు కాదు. వారిదంతా అదో వింత మాయా ప్రపంచం అనే చెప్పాలి. ఊ అంటే.. ఆ అంటే.. మీడియా ముందుకు తెలంగాణలో కేటీఆర్, ఏపీలో అయితే సజ్జలనే రావడం చూశాం. కానీ.. సీఎంలు మాత్రం ఏనాడూ మీడియా ముందుకు వచ్చింది లేదు. అయితే.. మీడియా జర్నలిస్టులు వేసే ప్రశ్నలకే సమాధానం ఇచ్చుకోలేకనే జగన్ అవాయిడ్ చేసే వారనే ప్రచారమూ ఉంది. కేసీఆర్ అలా కాదు.. ఆయన మీడియాను ఎదుర్కోగలరు. అయినప్పటికీ ఆయన మీడియాకు దూరంగానే ఉండిపోయేవారు. అయితే.. గత పరిస్థితులను రేవంత్ పూర్తిగా మార్చేశారు. అందరి జర్నలిస్టులతో సఖ్యతగా ఉంటూనే.. వారి జాబ్‌కు సంతృప్తిని ఇస్తున్నారు.