https://oktelugu.com/

Neeraj Sharma: ఈ నేరస్థుడు మామూలోడు కాదు.. ఏకంగా సుఫారీ డబ్బుల కోసం పోలీసులనే ఆశ్రయించాడు!

ఏదైనా అన్యాయం జరిగితే చాలామంది పోలీసులను ఆశ్రయిస్తారు. తమకు జరిగిన బాధను చెప్పుకుంటారు. న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఇతడి ఉదంతం పూర్తి విభిన్నం. అతడు చేసిన నిర్వాకం జాతీయ మీడియాలో సంచలనంగా మారింది..

Written By:
  • Neelambaram
  • , Updated On : November 9, 2024 / 02:51 PM IST

    Anjali Garg Murder Case

    Follow us on

    Neeraj Sharma: అతడు ఒక ఒప్పంద నేరస్థుడు.. ఒక మహిళను హత్య చేయడానికి సుఫారీ కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం ఆ హత్య చేశాడు. అయితే ఆ హత్య చేయాలని చెప్పిన వ్యక్తులు తర్వాత అతడికి సుఫారి ఇవ్వలేదు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు లోతుగా తవ్వగా అనేక విషయాలు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో టిపి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది న్యాయవాది అంజలి గార్గ్ హత్యకు గురైంది. ఆమెను నీరజ్ శర్మ అనే ఒప్పంద నేరస్థుడు చంపాడు. దీనికిగానూ 20 లక్షలకు సుఫారి కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా లక్ష రూపాయలు ముందస్తుగా స్వీకరించాడు. అంజలిని గత ఏడాది జూన్ 7న ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అంజలికి గతంలోనే వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ తన మాజీ భర్త ఇంట్లోనే ఆమె ఉండేది. ఆ ఇంటిని ఆమె మాజీ భర్త యష్ పాల్, సురేష్ అనే వ్యక్తులకు విక్రయించాడు. అయితే వారు ఇంటిని ఖాళీ చేయాలని ఆమెను కోరినప్పటికీ నిరాకరిస్తూ వస్తోంది. ఇది వివాదంగా మారింది. దీంతో అంజలి పోలీసులను ఆశ్రయించింది. ఫలితంగా వారు ఆమె మాజీ భర్తను, బంధువులను ఆదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వదిలిపెట్టారు.. అయితే అంజలి మాజీ భర్త ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తులు.. సరికొత్త ప్రణాళిక రూపొందించారు. తాము కొనుగోలు చేసిన ఇంటిని ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్న అంజలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నీరజ్ శర్మ, మరో ఇద్దరితో కలిసి ఆమెను చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా వారు అంజలిని హత్య చేశారు.

    లోతుగా పోలీసుల దర్యాప్తు

    అంజలి హత్య కేసు సంచలనంగా మారడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దీనికి కారణంగా భావించి నీరజ్ శర్మ, యష్ పాల్, సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నీరజ్ శర్మ బెయిల్ పై విడుదలయ్యాడు. తాను అంజలిని హత్య చేశానని.. అప్పట్లో లక్ష మాత్రమే ఇచ్చారని.. మిగతా పంతొమ్మిది లక్షలు ఇవ్వాలని యష్ పాల్, సురేష్ ను కోరాడు. దీంతో వారు దానికి ఒప్పుకోలేదు. ఫలితంగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.” అంజలి హత్య కేసులో చాలామంది ఉన్నారు. అందులో ఆమె మాజీ భర్త,. అతని బంధువులకు కూడా భాగం ఉంది. దీనికి సంబంధించిన కాల్ రికార్డులను కూడా మీకు సమర్పిస్తున్నానని” పోలీసులతో పేర్కొన్నాడు. దీంతో వారు కేసును పున: ప్రారంభించారు.