HomeతెలంగాణTelangana DGP : మారిన తెలంగాణ పోలీస్‌ బాస్‌.. డీజీపీగా జితేందర్‌.. రవిగుప్తాకు కీలక బాధ్యతలు

Telangana DGP : మారిన తెలంగాణ పోలీస్‌ బాస్‌.. డీజీపీగా జితేందర్‌.. రవిగుప్తాకు కీలక బాధ్యతలు

Telangana DGP : తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌ వర్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిసారించేలోపే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఇటీవలే సార్వత్రిక ఎన్నికల ఘట్టం కూడా ముగిసింది. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసింది. తాజాగా పోలీస్‌ శాఖలో కీలక బదిలీలు చేసింది. ఏకంగా పోలీస్‌ బాస్‌నే మార్చేసింది. కొత్త పోలీస్‌ బాస్‌గా జితేందర్‌ను నియమించింది. గతేడాది చివరన తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తాజాగా రేవంత్‌ సర్కార్‌ రవిగుప్తాను బదిలీ చేసి ఆయన స్థానంలో జితేందర్‌కు అవకాశం కల్పించింది. రవిగుప్తాను హోంశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియామిస్తూ తెలంగాణ చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

జితేందర్‌ నేపథ్యం ఇదీ..
జితేందర్‌ 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఇప్పటి వరకు డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శింగా సేవలందించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ జితేందర్‌కు పదోన్నతి కల్పించారు. 2025 సెప్టెంబర్‌లో ఆయన ఉద్యోగ విమరణ చేయనున్నారు. ఈ క్రమంలోనే మరో 14 నెలలపాటు ఆయన డీజీపీగా విధులు నిర్వర్తించనున్నారు.

రైతు బిడ్డ నుంచి డీజీపీ వరకు..
జితేందర్‌ సొంత రాష్ట్రం పంజాబ్‌. జలందధర్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్‌ 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్, శిక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి పోసింగ్‌ నిర్మల్‌ ఏఎస్పీగా నియమితులయ్యారు. తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా కూడా సేవలు అందించారు. అనంతరం అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండే మహబూబ్‌నగర్‌ ఎస్పీగా నియమితులయ్యారు. తర్వాత గుంటూరు ఎస్పీగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం డిప్యుటేషన్‌పై సీబీఐలో చేరారు. ఆ తర్వాత 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో జితేందర్‌ విధులు నిర్వహించారు. డీఐజీగా ప్రమోషన్‌ అందుకుని.. విశాఖపట్నం రేంజ్‌ డీఐజీగా పనిచేశారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు..
ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ–అప్పాలో పని చేసిన జితేందర్‌.. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా ఉన్నారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోనూ ముఖ్యపాత్ర పోషించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గానూ పనిచేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా.. జైళ్లశాఖ డీజీగానూ జితేందర్‌ పనిచేశారు. డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్‌ను తాజాగా డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular