JCB Driver Subhan : ‘పోతే నేనొక్కడినే.. గెలిస్తే మాత్రం ఆ తొమ్మిది మందిని కాపాడుతా’ ఇదేదో సినిమా డైలాగ్ కాదండి. నిజజీవితంలో జరిగింది. ఆపదలో ఉన్న 9 మందిని కాపాడే క్రమంలో ప్రమాదాన్ని ఎదిరించాడు ఓ జెసిబి డ్రైవర్. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ తొమ్మిది మందిని కాపాడాడు. తాను మృత్యుంజయుడుగా నిలిచి రియల్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆయనే సుభాన్. ఖమ్మం వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని రక్షించి.. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ అధికారులు, రెస్క్యూ ఆపరేషన్ చేయలేని పనిని తాను సాధించాడు. అందర్నీ ఆకట్టుకున్నాడు. ఏకంగా జెసిబి తో వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు.
* మున్నేరులో చిక్కుకున్న తొమ్మిది మంది
వర్షాలకు ఖమ్మంలో మున్నేరు నది ప్రవహిస్తోంది. రెండు రోజుల కిందట మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వద్ద ఉన్న వంతెన దాటేందుకు ఓ 9 మంది ప్రయత్నించారు. వరదలు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. హెలిక్యాప్టర్లను తెప్పించిన ప్రతికూల వాతావరణం తలెత్తడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలోనే సుభాన్ ధైర్యంతో ముందుకు వచ్చాడు. పోతే తాను ఒక్కటి ప్రాణమే పోతుందని.. కానీ గెలిస్తే మాత్రం 9 మంది ప్రాణాలతో వస్తానని చెప్పి.. జెసిబి తో సహా వాగులోకి దిగాడు. ఆ తొమ్మిది మందిని సజీవంగా బయటకుతెచ్చాడు. బాధితులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుభాన్ ను ప్రతి ఒక్కరు ప్రశంసించారు.
* పొరపాటు పడ్డ నేతలు
మరోవైపు జెసిబి డ్రైవర్ విషయంలో బీఆర్ఎస్ నేతలు పొరపాటు పడ్డారు. జెసిబి డ్రైవర్ సాహసం బయటకు తెలియడంతో కొంతమంది నేతలు స్పందించారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చి సన్మానించే ప్రయత్నం చేశారు. అయితే సుభాన్ అనే పేరుతో మరొకరికి సన్మానం చేశారు. సన్మానం చేయించుకున్న వ్యక్తి కూడా అసలు విషయం చెప్పలేదు. దీంతో ఆ నోటా ఈ నోటా ఇది తెలియడంతో సుభాన్ విషయం వెలుగులోకి వచ్చింది. తాము పొరపాటు పడ్డామని భావించిన నేతలు సుభాన్ కు శా లువలు వేసి సన్మానించారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు.
* నిజంగా వారిది సాహసమే
వరద సహాయ చర్యల్లో జెసిబి ఆపరేటర్లు, పడవలను నడిపే మత్స్యకారులు విశేష సేవలు అందిస్తున్నారు. వందలాది జెసిబిలు వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. అటు చేపలు పట్టే మత్స్యకారులు సైతం వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేస్తున్నారు. ఆహార పదార్థాలు అందించే బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా ఫ్లడ్ వారియర్స్ గా వారు అందిస్తున్న సేవలు అందరి అభిమానాన్ని అందుకుంటున్నాయి.
*ఒకే ఒక్కడు*
JCB డ్రైవర్ పోతే ఒక్కడిని*..
*వస్తే మేము పది మంది అని అధికారులు వారిస్తున్న JCB తో ముందుకు వెళ్లి 9 మంది ప్రాణాలు కాపాడిన హీరో.. ఖమ్మం జనం తరుపున నీకు సెల్యూట్ అన్న pic.twitter.com/0gZRHVtj9F— Warrior (@warrior5506) September 2, 2024