Double Ismart OTT: అటు పూరి పూరి జగన్నాథ్… ఇటు రామ్ పోతినేని ప్లాప్స్ లో ఉన్నారు. పూరి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్ డిజాస్టర్ అయ్యింది. అలాగే రామ్ పోతినేని నటించిన స్కంద సైతం నిరాశపరిచింది. ఈ క్రమంలో హిట్ కాంబో సెట్ అయ్యి ఓ మూవీ చేశారు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకులను పలకరించారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈచిత్రానికి ఇది కొనసాగింపు. ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ కి కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రం. ఇస్మార్ట్ శంకర్ ఏకంగా రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. సంజయ్ దత్ విలన్ రోల్ చేశాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ విడుదల చేశారు. లాంగ్ వీకెండ్ తో పాటు సెలవు దినాలు కలిసొచ్చాయి. ఈ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా భారీ వసూళ్ళు దక్కేవి. అనూహ్యంగా డబుల్ ఇస్మార్ట్ నెగిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది.
ఇస్మార్ట్ శంకర్ ని డబుల్ ఇస్మార్ట్ మరిపించలేకపోయింది. పూరి మరోసారి తన మార్క్ చూపడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ కేవలం విడుదలైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో డబుల్ ఇస్మార్ట్ స్ట్రీమ్ అవుతుంది.
డబుల్ ఇస్మార్ట్ మూవీ కథ విషయానికి వస్తే… బిగ్ బుల్(సంజయ్ దత్) వరల్డ్ మాఫియా డాన్. వెపన్స్ సప్లై చేస్తుంటాడు. మరణం లేకుండా జీవించాలి అనేది అతడి కల. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన బిగ్ బుల్ అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి బారిన పడతాడు. అతడికి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. మరో మూడు నెలల్లో మరణిస్తావని డాక్టర్స్ చెబుతారు.
ఈ మరణాన్ని జయించాలంటే బిగ్ బుల్ మెమరీస్ మరొకరి మెదడులోకి ట్రాన్స్ఫర్ చేయడమే మార్గం అని ఓ సైంటిస్ట్ చెబుతాడు. అయితే ఆ ప్రయోగం చాలా మంది మీద చేసినా ఫలితం దక్కదు. గతంలో ఈ ప్రయోగం చేయబడ్డ ఇస్మార్ట్ శంకర్(రామ్ పోతినేని) తో తన లక్ష్యం నెరవేరుతుందని బిగ్ బుల్ భావిస్తాడు. బిగ్ బుల్ లక్ష్యం నెరవేరిందా?బిగ్ బుల్ తో ఇస్మార్ట్ శంకర్ తల్లి పోచమ్మకు ఉన్న సంబంధం ఏమిటీ? అనేది మిగతా కథ..