Pro Kabaddi: ప్రోకబడ్డీ లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతన్నాయి. టేబుల్ టాపర్‌గా ఉన్న హరియాణా స్టీలర్ట్స్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 47–30 తేడాదో యూ ముంబాను చిత్తు చేసింది. హరియాణా లెఫ్ట్ రైడర్స్ శిమ్ పటారే 14 పాయింట్లతో జట్టును గెలిపించాడు. యూ ముంబలో సతీశ్ కన్నర్ 9 పాయింట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ అరంభం నుంచి హరియాణా దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలైఔట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 26–14 పాయింట్లతో ఆధిక్యం కనబర్చింంది. విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. చివరకు సునాయాస విజయం అందుకుంది. 22 మ్యాచ్‌లలో 16 విజాయాలతో పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
తెలుగు టైటాన్స్‌కు ప్లస్..
కీలక మ్యాచ్‌లో యు ముంబా జట్టు ఓటమి తెలుగు టైటాన్స్‌కు కలిసి వచ్చింది. యూ ముంబకు ఇంకో మ్యాచ్ మిగగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో 13 పాయింట్ల తేడాతో ఓడితే తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఆ జట్టు బెంగాల్ వారియర్స్‌తో మంగళవరాం చివరి మ్యాచ్ ఆడుతుంది. బెంగాల్ వారియర్స్ ఈ జీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టు ఫామ్ నేపథ్యంలో యూ ముంబా ఓటమి కష్టమే. అద్భుంతం జరిగేత తప్ప తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశం లేదు. టైటాన్స జట్టు 22 మ్యాచ్‌లు ఆడి 12 విజాయాలు, 10 పరాజయాలు పొందింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు..
టేబుల్ టాపర్‌గా ఉన్న హర్యాణా స్టీలర్స్, రన్నరప్‌గా పాట్నా పైరేట్స్ ప్లేఫ్ బెర్త్ ఖరారు చేసుకుని ఏకంగా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇక యూపీ యోధాస్, దబాంగ్ ఢిలీ, జైపూర్ పింక్ పాంథర్స్, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆరో స్థానం కోసం యూ బుంబా, తెలుగు టైటాన్స మధ్య పోటీ ఉంది. తెలుగు టైటాట్స్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. యూ ముంబాకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. ఆఖరు మ్యాచ్ తర్వాత ఆరోస్థానంపై స్పష్టత వస్తుంది.