KCR : కుంభవృష్టి.. కుండ పోత.. మేఘాల విస్ఫోటనం.. ఈ ఉపోద్ఘాతాలు కూడా సరిపోవు. శుక్ర, శని వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీకి మించిన వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో 30 కి మించి సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ముఖ్యంగా ఏపీలోని కృష్ణ, గుంటూరు, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. వాస్తవానికి ఈ స్థాయిలో వర్షపాతం గతంలో ఎన్నడూ నమోదు కాలేదు. చాలామంది మేఘాలు బద్దలయ్యాయా? వరుణుడు తన కోపాన్ని మొత్తం ఈ జిల్లాల మీద చూపించాడా? సోషల్ మీడియా లో వ్యాఖ్యానించారు. అయితే దీనికి వాతావరణ నిపుణులు చెబుతున్న అసలు కారణం మరో విధంగా ఉంది.
నైరుతి రుతుపవనాల కాలంలో..
నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలు, వాయుగుండాలు సర్వసాధారణంగా ఏర్పడుతుంటాయి. అయితే ఇవి ఎక్కువగా నైరుతి ప్రాంతంలో వర్షిస్తుంటాయి. అల్పపీడనాలకు, వాయుగుండాలు నైరుతి భాగంలో కుంభవృష్టి స్థాయిలో వర్షాలు కురుస్తాయి. అందువల్లే ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ఖమ్మం, వరంగల్ జిల్లాలో విపరీతంగా వర్షాలు కురిసాయి.. నైరుతి కాలంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేదా వాయు గుండాలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో అరేబియా సముద్రం నుంచి మేఘాలు భారీగా తేమను గ్రహించినప్పుడు పశ్చిమ కనుమలు, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ వల్ల ఈశాన్య ప్రాంతాలలో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. దీనికి వాతావరణంలో మరికొన్ని పరిస్థితులు తోడైతే స్థాయిలో వర్షాలు కురుస్తాయి.. శుక్ర, శని, ఆది వారాల్లో కురిసిన వర్షాలు అందువల్లేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు భూమ్మీదికి వచ్చే సమయంలో భారీగా తేమను మోసుకువస్తుంటాయి. ఆ సమయంలో నైరుతి భాగంలో ఎక్కువగా తేమ కేంద్రీకృతమై ఉంటుంది. మిగతా ప్రాంతాలలో మామూలుగా వర్షాలు కురుస్తుంటాయి.
తీవ్రమైన ఎండల వల్ల అనిశ్చిత వాతావరణం
ఆగస్టు నెలలో తీవ్రమైన ఎండల వల్ల భూమి వేడెక్కింది. సముద్రం కూడా తీవ్రంగా వేడెక్కింది. ఫలితంగా అటు భూమి, ఇటు సముద్రంపై ఆనిశ్చితి వాతావరణ ఏర్పడింది. ఈ ప్రభావాలతో వాయుగుండం స్థాయికి మించి సముద్రం నీటిని స్వీకరించింది. అదే స్థాయిలో భూమ్మీదికి వదిలింది. అలా వదిలిపెట్టిన ప్రాంతం లో విపరీతమైన వర్షాలు కురిసాయి. అయితే ఈ స్థాయిలో వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఒకటి లేదా రెండు గంటల వ్యవధిలో కొద్ది ప్రాంతాల పరిధిలో విపరీతమైన వర్షాలు కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: It is not a cloud burst as kcr said in the past that is the reason for all these rains
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com