Hyderabad Real Estate : హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌పై అమరావతి ప్రభావం ఉందా… బ్రాండ్ వ్యాల్యూ ఎలా ఉంది?

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. హైడ్రా కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ప్రచారం ఇదీ.

Written By: Raj Shekar, Updated On : October 31, 2024 10:38 am

Hyderabad Real Estate

Follow us on

Hyderabad Real Estate : తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నేల చూపు చూస్తోంది. వ్యాపారంలో స్తబ్ధత నెలకొంది. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత రియల్‌ వ్యాపారం కుదేలైంది. కాంగ్రెస్‌ చర్యలే ఇందుకు కారణం.. ఇదీ తెలంగాణలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం. ఇక తాజాగా తెలంగాణ రియల్‌ వ్యాపారంపై అమరావతి ఎఫెక్ట్‌ పడింది అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి చర్యలు చేపట్టడం, కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించడంతో పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను వీడుతున్నారు.. అమరావతిలో పెట్టుబడి పెడుతున్నారు అన్న ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ రిజిస్ట్రేషన్‌ ఆదాయం భారీగా పడిపోతోంది అని పేర్కొంటున్నారు. కానీ, వాస్తవానికి దేశవ్యాప్తంగా రియల్‌ వ్యాపారం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కానీ, హైడ్రాను బూచిగా చూపి కొందరు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. వాస్తవానికి రియల్‌ వ్యాపారం చెరువులు, కుంటల్లో జరగడం లేదు. కొన్ని సంస్థలు, కొంత మంది వ్యాపారులు మాత్రమే చెరువులు, కుంటలను ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. వాటిని కొన్నవారే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కానీ, హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో వ్యాపారం దెబ్బతిన్నట్లు చేస్తున్న ప్రచారాన్ని వ్యాపారులే తప్పు పడుతున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, పెట్టుబడిదారులు అమరావతికి తరలి పోవడం లేదని పేర్కొంటున్నారు. కొంత మంది హైదరాబాద్‌తోపాటు అమరావతిలోనూ పెట్టుబడి పెడుతున్నారని చెబుతున్నారు.

హైదరాబాద్‌ ఓ బ్రాండ్‌..
హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారం తగ్గడం ఎన్నటికీ జరుగదు. హైదరాబాద్‌ అంటే ఓ బ్రాండ్‌ . ఇది ఓవర్‌నైట్‌తో రాలేదు. అనేక మంది ముఖ్యమంత్రుల కృషితో వచ్చింది. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యాపారులు కూడా పెట్టుబడి పెట్టారు. హైరదాబాద్‌ అన్నింటికి సెంటర్‌ పాయింట్‌. అన్ని ఐటీ కంపెనీలకు నెలవు. ఇక్కడి వాతావరణం.. చాలా ప్రధానమైనది. ఇక్కడ వరదలు, భూకంపాలు రావడం జరుగదు. ఇక హైదరాబాద్‌లో విప్రో, యాపిల్, అమేజాన్, గూగుల్‌ తదితర ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. అమెరికా తర్వాత అంతటి ప్రాధాన్యత హైదరాబాద్‌కే ఉంది. ఇక హైదరాబాద్‌లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. రెడ్డీస్‌ల్యాబ్, శాంతా బయోటెక్‌ లాంటి మందులు హైదరాబాద్‌లోనే తయారవుతాయి. సైన్యానికి అందించే అనేక ఆయుధాలు, పరికరాలు, డ్రోన్‌ కెమెరాలు హైదరాబాద్‌లోనే తయారవుతాయి. దేశంలో ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు కూడా హైదరాబాద్‌లోనే తయారవుతాయి. ఇక కరోనా వ్యాక్సిన్‌ దేశీయంంగా తయారైంది కూడా హైదరాబాద్‌లోనే. ఇలా అనేక సంస్థలకు హైదరాబాద్‌ నెలవు.

భౌగోలికంగా అనుకూలం..
ఇక హైదరాబాద్‌ పెట్టుబడులకు అనుకూలించే మరో అంశం భౌగోలిక పరిస్థితి. ఇక్కడి నుంచి దేశంలోని ఏ ప్రాంతంంలోకి అయినా వెళ్లే ఆవకాశం ఉంది. మెట్రోతోపాటు అన్ని ప్రాంతాలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డు, ఎయిర్‌ వేస్‌ ఉన్నాయి. ఇక్కడ వరదలు వచ్చే అవకాశం కూడా తక్కువ. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ పెట్టుబడి పెట్టినవారు ఉప సంహరించుకునే పరిస్థితి ఉండదు. సీఎంలు ఎంత మంది మారినా రియల్‌ వ్యాపారం మాత్రం తగ్గలేదు.

రెండూ అభివృద్ధి..
హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టిన ఆంధ్రా ప్రాంత వ్యాపారులు ఇక్కడి పెటుట్టుబడులను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా లేరు. హైదరాబాద్‌తోపాటు అమరావాతి కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనలో ఆంధ్రా పెట్టుడిదారులు ఉన్నారు. దీంతో హైదరాబాద్‌తో తమ పెట్టుబడులు ఉన్నా.. అమరావతిలోనూ పెట్టుబడికి ముందుక వస్తున్నారు. తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఎవరూ కాదను. అదే సమయంలో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడులకు కొదవ లేదు. దేశ విదేశాల్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. ఈ తరుణంలో హైడ్రా కారణంగా వ్యాపార తగ్గిందన్న వాదనలో నిజం లేదు. ప్రస్తుత పరిస్థితి, స్తబ్ధత తాత్కాలికమే అని మార్కెట్‌æనిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే అన్నీ సర్ధుకుంటాయని చెబుతున్నారు.