https://oktelugu.com/

Bigg Boss Teugu 8: బిగ్ బాస్ హౌస్ కి కొత్త ‘మెగా చీఫ్’ గా అవినాష్..నిఖిల్, నభీల్ ని చాలా తెలివిగా ఓడించేసాడుగా..!

బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీప్ శోభా శెట్టి కోసం ఆడి, ఆమెని గెలిపించి కెప్టెన్ ని చేస్తాడు గుర్తుందా..?,ఇంచుమించు ఈ టాస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ టాస్క్ లో చివరి వరకు పోరాడుతూ నిఖిల్, నభీల్, అవినాష్ మిగులుతారు. వీళ్ళ మధ్య చాలా భీకరమైన పోరు జరుగుతుంది, చివరికి అవినాష్ బ్యాగ్ లో ఎక్కువ బాల్స్ ఉండడంతో ఆయన ఈ టాస్క్ లో విజేత గా నిలిచి హౌస్ కి మెగా చీఫ్ అవుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 10:41 AM IST

    Bigg Boss Teugu 8

    Follow us on

    Bigg Boss Teugu 8: ఈ వారం కంటెస్టెంట్స్ కి మెగా చీఫ్ అయ్యేందుకు ‘బిగ్ బాస్ ఇంటికి దారేది’ అనే టాస్క్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో నిఖిల్ కొన్ని సందర్భాలలో తప్పులు చేసినప్పటికీ, ఓవరాల్ గా అత్యధిక లెవెల్స్ లో తమ టీం ని గెలిపించాడు. కానీ చివరికి అవినాష్ మెగా చీఫ్ అయ్యినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘మెగా చీఫ్’ అయ్యేందుకు బిగ్ బాస్ చివరి లెవల్ నిర్వహిస్తాడు. ఈ చివరి లెవల్ లో మెగా చీఫ్ అయ్యేందుకు పాల్గొనే కంటెస్టెంట్స్ గా హరి తేజ, నిఖిల్, నభీల్, టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ పేర్లను ప్రకటిస్తాడు. టాస్క్ ఏమిటంటే బీన్ బ్యాగ్ లో ధర్మో కోల్ బాల్స్ ఉంటాయి. వాటిని కాపాడుకోవాలి. ఎవరి బీన్ బ్యాగ్ అయితే బరువుగా ఉంటుందో, వాళ్ళు ఈ టాస్క్ లో విజేతగా నిలిచి హౌస్ కి మెగా చీఫ్ అవుతారు.

    బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీప్ శోభా శెట్టి కోసం ఆడి, ఆమెని గెలిపించి కెప్టెన్ ని చేస్తాడు గుర్తుందా..?,ఇంచుమించు ఈ టాస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ టాస్క్ లో చివరి వరకు పోరాడుతూ నిఖిల్, నభీల్, అవినాష్ మిగులుతారు. వీళ్ళ మధ్య చాలా భీకరమైన పోరు జరుగుతుంది, చివరికి అవినాష్ బ్యాగ్ లో ఎక్కువ బాల్స్ ఉండడంతో ఆయన ఈ టాస్క్ లో విజేత గా నిలిచి హౌస్ కి మెగా చీఫ్ అవుతాడు. అవినాష్ ఈ వారం టాస్కులు మొత్తం బాగానే ఆడాడు కానీ, అతని కంటే విపరీతమైన కష్టం చూపించి గేమ్స్ ఆడిన యష్మీ, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ లలో ఎవరో ఒకరు మెగా చీఫ్ అయ్యుంటే బాగుండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత వారంలో విష్ణు ప్రియ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎలాంటి కష్టం చేయకుండా ఆమె చాలా తేలికగా మెగా చీఫ్ అయ్యింది. అయితే ఇన్ని రోజులు తనలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపిస్తూ వచ్చిన అవినాష్, ఈ సీజన్ లో గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడాడు.

    అలాగే ఈయన మెగా చీఫ్ గా హౌస్ కి ఎలాంటి నాయకత్వం అందిస్తాడో చూడాలని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నభీల్, నిఖిల్ మధ్య పెద్ద ఫైటింగ్ జరుగుతుందట. ఇన్ని రోజులు అన్నదమ్ములు లాగా కలిసి మెలిసి ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా గొడవలు ఏర్పడ్డాయి. ఈ వారం నిఖిల్ తో స్నేహితులందరూ గొడవపడ్డారు, తప్పు నిఖిల్ లో ఉందా?, లేకపోతే కంటెస్టెంట్స్ అందరూ ఈయనని టార్గెట్ చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వీటిపై రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి. గత రెండు వీకెండ్స్ లో నాగార్జున హోస్టింగ్ పట్ల అభిమానులు చాలా తీవ్రమైన అసంతృప్తి తో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.