CM Revanth Reddy: శీర్షిక చదవగానే ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే రేవంత్ కాంగ్రెస్‌నేత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బద్ధ శత్రువలైన ఇరు పార్టీలు అండగా ఉండడం ఏంటి అనిపిస్తుంది కదూ. కానీ, నిజమే. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఎన్నికల వరకే రాజకీయాలు అన్నట్లు పరిస్థితిని మార్చేశారు. గతంలో కాంగ్రెస్‌లా కాకుండా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరు వచ్చి అడిగినా కాదనకుండా నిధులు ఇస్తున్నారు.
గతంలో ఇలా..
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపేది. రాష్ట్రాలకు పన్నుల వాటా నుంచి రావాల్సిన నిధులు కూడా సులభంగా మంజూరు చేసిన దాఖలాలు లేవు. వాటి కోసం కూడా మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రులు పలుమార్లు డిల్లీ వెళ్లాల్సి వచ్చేది. ఇక అదనంగా నిధులు కావాలంటే పదే పదే వినతులు అందించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పార్టీలతో సంబంధం లేకుండా నిధులు మంజూరు చేస్తోంది. పన్నుల్లో వాటాలు ఇస్తోంది.
రేవంత్ వెళ్లి కలవగానే..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. బీఆర్‌ఎస్ సీఎం కేసీఆర్ కేంద్రంలో గొడవపడి రెండేళ్లు కేంద్రాన్ని ఎలాంటి సాయం కోరలేదు. ప్రధాని తెలంగాణకు వచ్చినా వెళ్లి కలవలేదు. అయినా మోదీ సర్కార్ రాష్ట్రానికి నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు మంజూరు చేశారు. అభివృద్ధి పనులకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. తాజాగా రేవంత్ గెలిచాక ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. తర్వాత మరోమారు వెళ్లి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం విన్నవించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.
ఆర్‌ఆర్‌ఆర్, హైదరాబాద్ – విజయవాడ రోడ్డు విస్తరణకు..
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంతోపాటు హైదరాబాద్–విజయవాడ ఆరులైన్ల రహదారిగా విస్తరించడం కోసం విన్నవించారు. అడిగింతే తడవుగా కేంద్ర మంత్రి రోడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. అందుకు అవసరమైన నిధులను కూడా కేంద్రమే ఇస్తుందని కూడా తెలిపారు.
ఇదే.. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. నేడు బీజేపీ ఉన్నప్పటి పరిస్థితికి తేడా. రాజకీయాలను ఎన్నికల తర్వాత వదిలేసి.. అభివృద్ధిపైనే కేంద్రం ఫోకస్ పెడుతోంది. అందుకే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్‌కు కూడా నిధులు ఇవ్వడానికి అంగీకరించింది. రేవంత్ సర్కార్‌కు, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.