BJP MP viral comments: ప్రతిసారి ఎన్నికలు వచ్చే సమయంలో ఓటుకు నోటు వద్దు అనే నినాదం తప్పకుండా వినిపిస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ డబ్బు తీసుకోకుండా ఓటుకు వేయాలని.. సోషల్ మీడియా ద్వారా కొందరు ఓటును అమ్ముకోవద్దు అంటూ ప్రచారం చేస్తున్నా.. చాలామంది ఓటు వేయడానికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అయితే డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలని కొందరు రాజకీయ నాయకులు సైతం ప్రసంగాలు చేస్తుంటారు. అయితే తాజాగా బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఓటుకు డబ్బు తీసుకోవడం కరెక్టే అన్న స్టైల్ లో మాట్లాడారు. అసలు ఆయన అలా ఎందుకు అన్నారంటే?
ఇటీవల కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో చేసే ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో రాజకీయ నాయకులు మాటలతో ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి పార్టీ జెండా లేకుండా ఈ ఎన్నికలు జరుగుతున్నా కూడా కొందరు పరోక్షంగా ఈ ఎన్నికలపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఇటీవల ఓ సోషల్ మీడియా influencer తో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కొన్ని ఓట్లకు నోటు అవసరమే అన్నారు.
ఉదాహరణకు గ్రామాల్లో ఎంతోమంది నాయకులు పోటీ చేస్తూ ఉంటారు. వీరికి ప్రతి ఒక్క ఓటు కీలకంగా మారుతుంటుంది. ఇందులో భాగంగా గ్రామంలో ఓట్లు ఉండి వివిధ ప్రదేశాల్లో నివసిస్తున్న వారిని పోలింగ్ రోజు రావాలని కోరుతుంటారు. అయితే దూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం ఓటు వేయడానికి సొంత గ్రామానికి వస్తుంటారు. అయితే ముందుగానే తమకు ఓటు వేసే విధంగా కొందరు నాయకులు ఓటర్లకు ఖర్చులు భరిస్తాం అంటూ చెబుతుంటారు. ఈ క్రమంలో వారికి ఖర్చులకోసం డబ్బులు ఇస్తుంటారు. ఎంతో ప్రయాసపడి పనులు చెడగొట్టుకొని ఓటు వేయడానికి వచ్చేవారికి డబ్బులు ఇస్తే తప్పేంటి? అన్న కామెంట్లో చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్పంచ్ ఎన్నికల వాతావరణం లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా చర్చ సాగుతోంది.
అయితే కొందరు ఈ వీడియోకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం ఓటు వేసేందుకు వచ్చేవారికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని.. ఇలా చేయడం వల్ల డబ్బు పంపిణీ ఉండదని అంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కొందరు ప్రత్యేకంగా చార్జీలు భరిస్తాం అంటే.. దానిని ఓటు కొనుక్కోవడమే కదా.. అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికలవేళ ఎంపీ వాక్యాలు హాట్ టాపిక్ గా మారాయి.
View this post on Instagram