Middle East war: మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అంటారు. ఇది నిజమే.. అనేక సందర్భాలలో నిరూపితమైంది కూడా. మనుషులు కాకుండా నగరాలను పోలిన నగరాలు ఉంటాయా.. మనుషులంటే సాధ్యమవుతుందేమో గాని.. నగరాలు ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి.. ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి.
హైదరాబాద్ నగరం ఇప్పుడంటే గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. కానీ ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐకానిక్ సింబల్ గా చార్మినార్ ఉండేది. చార్మినార్ ను కూలీకుతుబ్ షా నిర్మించారని మనందరికీ తెలుసు. అయితే ఈ నిర్మాణశైలి ఇక్కడిది కాదు. చార్మినార్ ను రూపొందించిన ఆర్కిటెక్ట్ పేరు మీర్ మోమిన్. కూలీ కుతుబ్ షా పరిపాలన కాలంలో హైదరాబాద్ నగరం నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో గోల్కొండ మాత్రమే ఉండేది. అది ఇరుకుగా ఉండడంతో మూసీ నదికి అవతల ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని అనుకున్నారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మూసినది అడ్డుగా ఉండడంతో వంతెన నిర్మించాలని అనుకున్నారు. ఆ వంతెన నిర్మాణానికి ఆర్కిటెక్ట్ గా మోమిన్ వివరించారు. ఇతడిది ఇరాన్ లోని సపా విద్ రాజ్యంలోని ఇస్ఫహాన్ ప్రాంతం. ఆస్తారా బాద్ ప్రాంతంలో ఇతడు పుట్టాడు. నాడు ఈయన పండితుడిగా వ్యవహరించేవాడు.
సఫా విద్ రాజ్యానికి చెందిన రాజకుమారుడు హైదర్ కు ట్యూటర్ గా పని చేసేవాడు. ఆర్కిటెక్ట్ మాత్రమే కాకుండా.. అనేక అంశాల్లో ఇతడికి విపరీతమైన జ్ఞానం ఉంది. అక్కడి రాజు చనిపోయిన తర్వాత హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఇతడు వచ్చే సమయం నాటికే హైదరాబాద్ నగరానికి పర్షియా ప్రాంతం నుంచి నిపుణులు హైదరాబాద్ వస్తున్నారు. అయితే వారందరినీ కూడా ఇతడు తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు.
Also Read: రెడ్డోళ్ళు.. కమ్మొళ్ళు.. అదే పని చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి బయట పెట్టిన నిజం!
ప్రస్తుతం ఇస్ఫహాన్ నగరం బాంబులతో అతలాకుతలమవుతోంది. ఈ నగరానికి, హైదరాబాద్ కు బలమైన సంబంధం ఉంది. హైదరాబాద్ నగరానికి ఇస్పహాన్ మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఇస్ఫ హాన్ నగరస్ఫూర్తితో హైదరాబాదులో చార్మినార్, పురానాపూల్, ఆఘర్ ఖాన్ వంటి కట్టడాలను నిర్మించారు. ఇస్ఫ హాన్ నగరంలో ఉన్న కట్టడాలు మొత్తం ఇప్పుడు ఇజ్రాయిల్ దాడుల వల్ల నేల కూలిపోతున్నాయి. దీంతో ఇక్కడి పాతబస్తీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తుండగానే ఇస్ఫ హాన్ నగరం నాశనం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇస్పహాన్ నగరంలో ఉండేవారు హైదరాబాద్ వచ్చినప్పుడు భ్రమపడేవారు. ఎందుకంటే అక్కడి మాదిరిగానే ఇక్కడ కూడా కట్టడాలు ఉండడంతో ఆశ్చర్యపోయేవారు.. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత.. ఇస్పహాన్ నగరంలో కట్టడాలు.. హైదరాబాద్ నగరంలో కట్టడాలు విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి.. అయితే ఇప్పుడు ఈ నగరం మీద దాడులు జరగడంతో గత చరిత్ర మొత్తం కాలగర్భంలో కలిసిపోతుందని హైదరాబాద్ నగరంలోని పాతబస్తి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.