Nagoba Jatara: ఆదిలాబాద్(Adilabad)లో అడవుల్లో ఆదివాసీ పండుగ సందడి మొదలైంది. ప్రత్యేక సంగీత వాయిద్యాలు మార్మోగుతున్నాయి. డోల్ డప్పులతో అడవుల జిల్లా గూడేలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు ముహూర్తం సమీపిస్తుండడంతో దేశం నలుమూలల నుంచి గిరిజనం అడవుల జిల్లా ఆదిలాబాద్ బాట పడుతున్నారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రాణంలా చూసుకునే వేడుకతో సందడి మొదలైంది.
గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల నడుమ ఆదిలాబాద్ అడవుల్లో జీవనం సాగిస్తున్న తొమ్మిది తెగల ఆదివాసీల సొంతం ఈ నాగోబా జాతర. గోండు, తోటి, పర్దాన్, కోయా, కొలాం, అం«ద్, చెంచు, నాయక్‌పోడ్ తెగల తీరొక్క వాయిద్యాల వినసొంపైన సంగీతంతో ఇంద్రవెల్లి కేస్లాపూర్ మార్మోగుతోంది. పుష్యమాసం వచ్చిందంటే ఆ ధ్వని మరింత రెట్టింపై ఆకాశమంత విస్తరించిందా అన్నట్లు వినిపిస్తుంటే జంగుబాయి, నాగోబా, ఖాందేవ్ జాతరల్లో ప్రత్యేకంగా మోగుతున్న వాయిద్యాల శబ్దం విని తీరాల్సిందే. అందులో ప్రధానమైనవే పెప్రే, ధోలు, కాళికోం, గుమ్మెళ, పర్ర, వెట్టె, పెప్రె, తుడుం, డప్పు, పేటి. ఒక్కో తెగకు ఒక్కో వాయిద్యం అన్నట్లుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఫరిడవిల్లుతోంది. ఆదిమ గిరిజన సంగీతం.
ప్రాచీన తెగ కొలాం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ తొమ్మిది తెగల్లో కొలాం తెగ ప్రాచీనమైదని. వీరు ఆడే ఆట పాడే పాట భిన్నంగా ఉంటాయి. ఈ తెగ గిరిజనం డోలు, డప్పు, మృదంగం, గుమ్మేల, పిల్లనగ్రోవి వాయిద్యాలను వాయిస్తూ వాటికి అనుగునంగా నృత్యం చేస్తారు. పెళ్లిళ్లలో అయితే వేత, డెంసా అనే నృత్యాలను పోటీలుపడి చేస్తారు. ఇక నాయక్‌పోడ్ ఆడిపాడే తప్పెటగూళ్ల ఆటలు, రంజ, సన్నాయి, పిల్లనగ్రోవులు వాయిద్యాలు ఆకట్టుకుంటాయి. తోటి, పర్దాన్ తెగ ఉపయోగించే కీకిరి వాయిద్యాన్ని తంత్రీలు, చర్మంతో కలిపి తయారు చేస్తారు. ఈ కీకిర వాయిద్యంతో కళాకారులు గోండు సంస్కృతికి చెందిన అన్నోరాని, సదర్బీడి వంటి కథలను కథాగానం చేస్తారు.
కొన్ని వాయిద్యాలు జాతర కోసమే..
ఆదివాసీలు ఉపయోగించే కొన్ని వాయిద్యాలు కేవలం పండుగలు, దేవతల కొలుపులు, జాతర కోసమే ఉపయోగిస్తారు. అటువంటి వాయిదాల్లో గుమేల, పర్ర, వెట్టె వంటి చర్మ వాయిద్యాలు. ప్రస్తుతం నాగోబా జాతర నేపథ్యంలో అడవుల్లో పండుగ సందడి మొదలైంది. పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వేళ గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని తమ ఆరాధ్య దైవం నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతర 5 రోజులు సాగుతుంది. మూడో రోజు నిర్వహించే దర్బార్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
నాగోబా జాతర చరిత్ర..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో క్రీ.శ 740లో పడియేరు శేషసాయి అనే నాగ భక్తుడు ఉండేవాడు. ఆయన నాగదేవతను దర్వించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలో ద్వారాపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తమ తలుపులను సామాన్య మానవుడు తాకాడని తెలుసుకుని నాగరాజు ఆ6గహిస్తాడు. అప్పటి నుంచి ప్రాణభయంతో పండితుడిని కలిసి నాగదేవతను శాంతిపజేసే మార్గం చెప్పమని కోరతాడు.
ఏడు రకాల నైవేద్యాలతో..
అప్పుడు పండితుడు ఏడు బిందెల్లో పెరుగు, నెయ్యి, తేకె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడు రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. తన భక్తిని మెచ్చుకున్న నాగరాజుకేస్లాపూర్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు . ఆ ప్రాంతమే నాగోబా జాతరకు ప్రసిద్ధి. అప్పటి నుంచి ప్రతీ ఏడాది నాగరాజు విగ్రహానికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జాతర చేస్తున్నారు.
కుండల్లో వంటలు..
ఈ జాతరలో గుగ్గిల్ల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. ఇది కూడా సంప్రదాయంలో భాగమే. గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వశీయులకు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు గుగ్గిల్ల వంశస్తుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెబుతారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై పెట్టే పాత్ర, నీటి కుండలు కలిపి సుమారు 130కిపైగా తయారుచేస్తారు.వీటిలో గంగాజలం తీసుకొచ్చి వంట చేసి భక్తులకు భోజనం పెడతారు.
22 పొయ్యిలలో
ఈ జాతరలో మెస్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు ండుకునేది మాత్రం 22 పొయ్యిల మీదనే. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రహరీ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల వెలుగులో 22 పొయ్యిలమీద మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేస్తారు.
దర్బార్ విశిష్టత..
ఇక నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైనది దర్బార్. పూర్వం ఈ అడవిలోకి వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు. అక్కడి ప్రభుత్వ అధికారులు సైతం వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం కుమురంభీం నిజాం నవాబులతో పోరాడం చేసి వీరమరణం పొందాడు. దీంతో ఉలిక్కిపడిన నిజాం పాలకులు గిరిన ప్రాంత పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్‌ను అక్కడికి పంపారు. ఆయన జాతరై దృష్టిపెట్టారు. కొండలు, కోనలు దాటి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిచంకోవడానికి జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అలా 1942 నుంచి దర్బార్ మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది.