HomeతెలంగాణCM Revanth Reddy: ఆ మూడు సీఎం రేవంత్ కు చాలా ఇష్టం.. అవేంటో తెలుసా?

CM Revanth Reddy: ఆ మూడు సీఎం రేవంత్ కు చాలా ఇష్టం.. అవేంటో తెలుసా?

CM Revanth Reddy: ఎనుముల రేవంత్రెడ్డి.. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కొడంగల్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు వంట చేయడం, ఆటలు ఆడడం, చిత్రాలు గీయడం హాబీలు. ఈ మూడు చాలా ఇష్టమైన పనులు. కొంతకాలం ఓ పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు. సీఎం గురించి ఆయన ఇంట్లో 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఆశప్ప, మాణిక్యమ్మ, మల్లేశ్‌ను కదిలించగా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కొండారెడ్డిపల్లిలో ప్రాథమిక విద్య..
ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి రేవంత్‌రెడ్డి స్వగ్రామం. పాఠశాల విద్య స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. వనపర్తిలో కళాశాల స్థాయి విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడి రియల్‌ వ్యాపారం, ప్రింటింగ్‌ ప్రెస్‌ వ్యాపారాలు నిర్వహించారు.

కల్వకుర్తి, కొడంగల్‌లో ఇళ్లు..
రేవంత్‌ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కల్వకుర్తిలో ఇల్లు నిర్మించుకున్నారు. తర్వాత 2009లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడే సొంతిల్లు నిర్మించుకున్నారు. ఏటా దసరా పండగ తర్వాతి రోజు కొడంగల్‌కు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నారు. కరోనా లాక్‌డౌన సమయంలో కొడంగల్లోనే ఉన్నారు. కుటుంబీకులకు ఆయనే స్వయంగా వండిపెట్టారు.

పచ్చదనానికి ప్రాధాన్యం..
సీఎం రేవంత్రెడ్డి పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. కొడంగల్‌ లోని ఇంటి ప్రాంగణంలో పచ్చికతో కూడిన గార్డెన్‌ ఏర్పాటు చేశారు. చుట్టూరా ఎత్తయిన ప్రహరీ నిర్మించి రకరకాల చెట్లు, పూల మొక్కలు పెంచారు. పిత సెలోబియం అర్బోరియం (కోజబా అర్బోరియా) మొక్కను స్వయంగా నాటి దాని చుట్టూ గద్దె కట్టించారు. అక్కడే కార్యకర్తలతో సమావేశమవుతారు. 300 మంది వరకు కూర్చునే వీలుంది.

సోదరుడికి పెట్స్‌ ఇష్టం..
ఇక సీఎం సోదరుడు, కొడంగల్‌ నియోజకవర్గ బాధ్యుడు తిరుపతిరెడ్డికి శునకాలు అంటే ఇష్టం. కొడంగల్‌ నివాసంలో, హైదరాబాద్‌లోని నివాసంలో వాటిని పెంచుతున్నారు. వాటిలో బెల్జియం మిలైన్‌స్‌ జాతికి చెందిన శునకం ప్రస్తుతం కొడంగల్లో ఉంది.

ఆరోగ్యానికి ప్రాధాన్యం..
ఇక సీఎం రేవంత్‌కు నిత్యం ఉదయం 4 గంటలకు లేవడం ఆయనకున్న అలవాటు. గోరువెచ్చని నీటిని తీసుకుంటారు. ఆ తర్వాత 30 నిమిషాలు వ్యాయామం చేయడం దినచర్య. యాపిల్‌ లేదా పుచ్చకాయ జ్యూస్‌ తప్పనిసరిగా తీసుకుంటారు. దినపత్రిక చదివి కాసేపటికి టీ తాగుతారు. ఆ తర్వాత ముఖ్యమైన వారికి ఫోన్లు చేస్తారు. ఇంటికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతారు. స్నానం చేసి చపాతి లేదా జొన్నరొట్టె తీసుకుంటారు. నాటుకోడి కూర ఎంతో ఇష్టం. మటన్‌ బిర్యానీ ఇష్టంగా భుజిస్తారు. మధ్యాహ్నం ఆలస్యమైతే డ్రైఫ్రూట్స్‌ కాజు, బాదం, పిస్త, ఖర్జూరం వంటివి తీసుకుంటారు. ముద్ద పప్పు, సాంబారు పెరుగన్నం రోజూ ఉండాల్సిందే.

ఆటలు ఇష్టం..
రేవంత్‌రెడ్డికి క్రీడలంటే అమితాసక్తి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సమయాల్లో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు కొడంగల్‌ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు తన నివాసంలోనే అన్ని వసతులు కల్పించారు. తన మిత్రుడు వనపర్తికి చెందిన ఉపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి పోటీలను పర్యవేక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోటీలు అట్టహాసంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version