Indiramma Atmeeya Bharosa: ఇందిరమ్మ ఆత్యీయ భరోసా(Indiramma atmeeya Bharosa), రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల(Ration cards) జారీ, పాత కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియను జనవరి 26 నుంచి చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే సర్వే ప్రక్రియ ముగిసింది. ఇందులో గుర్తించిన లబ్ధిదారుల జాబితా ఆమోదించేందుకు జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ/వార్డు సభలు నిర్వహిస్తారు. ఇందలు ఆమోదం తెలిపిన తర్వాతనే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్ ఇచ్చారు.
మహిళల ఖాతాల్లోకి నగదు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా అబ్ధిదారుల ఎంపిక తర్వాత ఆ కుటుంబంలోని మహిళల ఖాతాల్లోనే(Womens Accounts)ఏడాదికి రూ.12 వేలు జమ చేయనున్నారు. తొలి విడత భరోసాలో భాగంగా ఈనెల 26న రూ.26 వేలు రైతు కూలీల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తారు. అంటే కూలీలు పురుషులైనా.. వారి ఇంట్లోని మహిళల ఖాతాల్లోనే అతడికి సంబంధించిన భరోసా డబ్బులు జమ అవుతాయి. మహిళా కూలీలకు వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తారు.
ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఎక్కువ మందికి లబ్ధి కలగాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి కూలీ పని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఏడాదికి కనీసం 20 రోజుల చొప్పున మూడేళ్లు పనిచేసిన కూలీలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. వారిపేరిట ఎలాంటి భూమి ఉండకూడదని తెలిపారు. అయితే కూలీల ఆధార్(Adhar), బ్యాంకు ఖాతా లింక్ చేయడంలో పొరపాట్లు జరిగాయి. దీంతో చాలా మంది వివారాలు సక్రమంగా లేకపోవడంతో వాటిని సరిచేసేందుకు మరో అవకాశం కల్పించింది.
సాంకేతిక సమస్యలు లేకుండా..
అర్హత ఉండి.. సాంకేతిక కారణాలతో లబ్ధిదారు నష్టపోకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు మంత్రి సీతక్క(Seethakka) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో అధికారులు సామాజిక స్పృహతో వ్యవహరించాలని సూచించారు. ఈ పథకం విఫలం చేసే కుట్రను కొన్ని శక్తులు పన్నుతున్నాయని, వాటిని తిప్పి కొట్టాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సామరస్యపూర్వక వాతావరణంలో సభలు నిర్వహించాలన్నారు.