Vande Bharat: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్ చెప్పిన రైల్వే శాఖ… త్వరలోనే సికింద్రాబాద్ నుంచి వందే భారత్…

Vande Bharat: ఇప్పటి వరకు భారత్ లో పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రమంలో తాజాగా మన దేశం లో త్వరలోనే బులెట్ రైలు పరుగులు తీయనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : July 12, 2024 3:07 pm

indian railways planning to start vande bharat sleeper train between secundrabad to mumbai

Follow us on

Vande Bharat: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భారతీయ రైల్వే లో కూడా చాలా మార్పులు జరిగాయి.ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే శాఖ సరికొత్త సాంకేతికను వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంది.ఇండియన్ రైల్వే లో ఇప్పటి వరకు మారుతున్న టెక్నాలజీ ని బట్టి ఎన్నో నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి.ఎప్పటి లాగానే రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కలిపించటం కోసం అలాగే వారికి సుఖవంతమైన ప్రయాణాన్ని అందించటం కోసం భారతీయ రైల్వే సిబ్బంది అనేక చర్యలు తీసుకుంటున్నారు.రైల్వే లో టికెట్ బుకింగ్ దగ్గర నుంచి ప్రమాదాలను కట్టడి చేసే వరకు సరికొత్త టెక్నాలజీ ని ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు రైల్వే సిబ్బంది.

ఇప్పటి వరకు భారత్ లో పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు ఇదే క్రమంలో తాజాగా మన దేశం లో త్వరలోనే బులెట్ రైలు పరుగులు తీయనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దేశం లో ప్రస్తుతం సెమీ హై స్పీడ్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే.వీటిలో ఇప్పటి వరకు కూర్చొని ప్రయాణించేందుకు మాత్రమే సౌకర్యాన్ని కల్పించటం జరిగింది.త్వరలోనే వీటిలో స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కేందుకు సన్నాహాలు చేస్తున్నారు భారతీయ రైల్వే సిబ్బంది.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్తను చెప్పింది రైల్వే శాఖ.త్వరలోనే సికింద్రాబాద్ నుంచి తొలి వందే భారత్ రైలు పరుగులు తీయనుందని సమాచారం.
వివరంగా చెప్పాలంటే…దేశవ్యాప్తంగా త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆగష్టు వచ్చే నెల నుంచే ఈ రైళ్లను ప్రారంభినచాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విడతల వారీగా ప్రధాన నగరాల మధ్య భారత రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తులు చేస్తుంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచే మొదటి స్లీపర్ వందే భారత్ రైలు పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ముంబై వరకు నడిపే అవకాశం ఉందని సమాచారం.వందే భారత్ రైలు సర్వీసు సికింద్రాబాద్ నుంచి ముంబై వరకు ఇప్పటి వరకు లేదు.ఇది దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి ముంబై వరకు స్లీపర్ వందే భరత్ రైలును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి ముంబై వరకు వందే భారత్ రైలు సర్వీసు లేని క్రమంలో వందే భారత్ స్లీపర్ రైలును ఈ మార్గంలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం కు సూచించినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే కు,రైల్వే బోర్డు కు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సికింద్రాబాద్ – ముంబై మధ్య వందే భరత్ స్లీపర్ రైలు తో పాటు సికింద్రాబాద్- పూణే మధ్య ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు స్తానం లో కూడా రైల్వే శాఖ వందే భరత్ రైలును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.ఏ మార్గం లో వందే భరత్ స్లీపర్ రైలు నడుస్తుంది అనే దాని గురించి ఇంకా రైల్వే శాఖ నుంచి ఎలాంటి వార్త అధికారికంగా రాలేదు.కానీ సికింద్రాబాద్ నుంచి ముంబై వరకు వందే భరత్ రైలు వచ్చినట్లయితే ఈ మార్గం లో ప్రయాణికులకు చాల లబ్ది కలుగుతుందని చెప్పచ్చు.దేశం లో ఇప్పటి వరకు కూర్చొని ప్రయాణించే వందే భారత్ రైళ్లు మాత్రమే నడుస్తున్న సమయంలో రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకోని రావడం తో ప్రయాణికులలో ఆనందం నెలకొంది.