Sakshi Media : గత 17 ఏళ్లుగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉద్యోగాలు చేసుకుంటున్న సాక్షి దినపత్రిక ఎంప్లాయీస్ ఇప్పుడు గందరగోళంలో పడ్డారా..? 17 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారా..? ఇన్నేళ్లుగా లేని ఈ పరిస్థితులు ఇప్పుడే ఎందుకు వచ్చాయి..? అసలు సాక్షిలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోంది..? ఉద్యోగులు, జర్నలిస్టుల్లో ఈ ఆందోళనకు గల కారణాలేంటి..? ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలేంటి..? ముందుముందు సంస్థలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి..? ఒక్క విజయమ్మ లేఖతో సాక్షి తలరాత మారిపోయిందా? ఈ బలమైన మీడియా ఇప్పుడు చేతులు మారబోతోందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సాక్షి జర్నలిస్టులని వేధిస్తున్నాయి.
ఈనాడుకు ప్రధాన పోటీగా.. ఈనాడును కనుమరుగు చేయడమే లక్ష్యంగా సాక్షి పురుడుపోసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి ప్రస్థానం ప్రారంభమైంది. వందలాది మందితో కూడిన పెద్ద వ్యవస్థగా ఏర్పాటైంది. పదుల సంఖ్యలో డైరెక్టర్లు, వందలాది మంది ఉద్యోగులు, వందలాది మంది జర్నలిస్టులు పత్రిక సొంతం. సాక్షి ప్రారంభం నుంచి చాలా మంది ఉద్యోగులు, జర్నలిస్టులు ఇంకా అందులోనే కొనసాగుతున్నారు. ఇక డైరెక్టర్ స్థాయిలో ఉన్న వారూ అలానే ఉన్నారు. 17 ఏళ్లుగా టైం టు టైం జీతాలు తీసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు వారందరిలో కొత్త ఆందోళన మొదలైంది.
YS Vijayamma open letter to YSR fans
సీఎం అవ్వగానే విడిపోదాం అని జగన్ ప్రపోజల్ పెట్టాడు అంటా pic.twitter.com/Gpon3hBslN
— Rajesh Kaipa (@rajeshkaipa) October 29, 2024
ఇటీవల జగన్, ఆయన చెల్లి షర్మిల మధ్య ఆస్తుల గొడవ మొదలైంది. ఆ గొడవలు కాస్త రచ్చకెక్కాయి. చివరకు తల్లి విజయమ్మ సైతం బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అయితే.. ఈ ఆస్తుల గొడవ కాస్త ఇప్పుడు సాక్షి ఉద్యోగులను గందరగోళంలోకి పడేసింది. చాలా మంది ఆఫ్ ది రికార్డ్ గా తమ భయాన్ని తోటి జర్నలిస్టులకు చెప్పుకుంటున్నారు.
వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు తన ఆస్తులను ఇద్దరికి కూడా సమాన భాగాలుగా ఇవ్వాలని చెప్పేవారని తాజాగా విజయమ్మ తన లేఖలో బయటపెట్టింది.. అందులో భాగంగానే సాక్షి పత్రికను షర్మిలకు చెందేలా ఒప్పందం జరిగిందని తాజాగా విడుదల చేసిన లేఖలో వైఎస్ విజయమ్మ సంచలన విషయాలు వెల్లడించింది. మరికొన్ని కంపెనీల పేర్లను అందులో బయటపెట్టింది. ఈ లెటర్ బయటకొచ్చినప్పటి నుంచి ఇక సాక్షి మీడియా, పత్రికలో గుబులు మొదలైంది.. కానీ.. ముందు నుంచి కూడా సాక్షి పత్రికన జగన్ మోహన్ రెడ్డి హస్తంలోనే ఉండిపోయింది. ఆయన చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన భార్య భారతిరెడ్డి ఆ హోదాలోకి వచ్చారు. అయితే.. గత కొన్నేళ్ల వరకు కూడా అన్నాచెల్లెళ్లు కలిసి ఉండడంతో అండర్ స్టాండిగుతో వెళ్లారు. షర్మిల కూడా సాక్షిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆస్తుల ఒప్పందం ప్రకారం.. సాక్షి ఒకవేళ ఆస్తుల పంపిణీలో షర్మిల దక్కించుకుంటే తమ పరిస్థితి ఏంటనే జగన్ ను నమ్ముకొన్న ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఉద్యోగులు బాగా హైరానా పడుతున్నారు. షర్మిల నడిపిస్తుందా? ఒకవేళ వైసీపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటుందా? తీసుకుంటే తమను కొనసాగిస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు జగన్‌ను నమ్ముకొని ఉన్న వందలాది మంది జర్నలిస్టుల్లో నెలకొన్నాయి. వారి భవిష్యత్తు ఏంటన్నది కూడా అర్థం కాకుండా ఉంది.
ముఖ్యంగా సాక్షిలో ఇప్పుడు పైస్థాయిలో ఉన్నవారంతా జగన్ లేదంటే ఆయన భార్య భారతి రెడ్డికి సన్నిహితులే ఉన్నట్టు ఆ మీడియాలోని జర్నలిస్టులు చెప్పుకుంటారు. . వారే కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎడిటర్‌ను కూడా మారుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలోకి కూడా భారతి చుట్టమైన వ్యక్తిని నియమించబోతున్నారని ప్రచారం సాగుతోంది.. అటు పలువురు డైరెక్టర్లు కూడా జగన్ సంబంధీకులే ఉన్నారని మీడియాలో టాక్ నడుస్తోంది.. హెచ్ఆర్ వ్యవస్థలోనూ భారతి బంధువే కీ రోల్ పోషిస్తున్నాడని అంటున్నారు.. ఇక సర్క్యూలేషన్, ఏడీవీటీ, ప్రొడక్షన్, తదితర విభాగాల్లోనూ వారే ఉన్నారు. ఇక సాక్షి టీవీకి వచ్చే సరికి కూడా సగభాగం వారే ఉన్నారని మీడియా వర్గాల్లో టాక్.. పెద్ద పెద్ద పోస్టుల్లోనే ఉన్నారు. నెలనెలా లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. అటు.. జిల్లాల్లోనూ కొన్ని యూనిట్లకు భారతికి సంబంధించిన వారే బ్రాంచ్ మేనేజర్లుగా ఉన్నారు. ఏజీఎం, డీజీఎం, మేనేజర్లు, ఆర్ఎంలుగా కొనసాగుతున్నారు.
అయితే.. ఇప్పుడు ఒకవేళ షర్మిల కనక ఆస్తుల పంపిణీలో సాక్షిని హ్యాండవర్ చేసుకుంటే తమ పరిస్థితి ఏంటన్న టెన్షన్ వారిలో మొదలైంది. జగన్ బ్యాచ్‌ను కొనసాగించేందుకు ఎలాగూ షర్మిల ఒప్పుకుంటారనేది అనుకోలేం. ఈ క్రమంలో ఈ పెద్ద పెద్ద తలకాయలంతా తదుపరి భవిష్యత్ ఏంటనే ఉత్కంఠతో ఉన్నారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వీరిలో షర్మిలతోనూ సత్సంబంధాలు ఉన్న వారు ఎంత మంది ఉన్నారు అంటే అసలు లెక్క బెట్టడానికి సంఖ్య కూడా లేదని చెప్పొచ్చు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేసిన సందర్భంలోనూ సాక్షి పెద్దగా కవరేజీ ఇవ్వలేదనే కోపం ఆమెలో ఉంది. ఈ క్రమంలో షర్మిల అడుగులు ఎటు పడబోతున్నాయి..? సాక్షి ఫ్యూచర్ ఎలా మారబోతోంది అన్నది ఇప్పుడు జర్నలిస్ట్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ.. ఏం జరుగుతుందన్నది ముందు ముందు చూడాలి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: If sharmila gets sakshi media in the asset distribution what will happen to the journalists appointed by jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com