spot_img
Homeటాప్ స్టోరీస్Hydra Ranganath TV9 Interview: హైడ్రా రంగనాథ్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన టీవీ9 రజనీకాంత్.....

Hydra Ranganath TV9 Interview: హైడ్రా రంగనాథ్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన టీవీ9 రజనీకాంత్.. వైరల్ వీడియోలు

Hydra Ranganath TV9 Interview: హైడ్రాకు అధిపతిగా వచ్చిన రంగనాథ్ ఇప్పటివరకు ఎన్నో మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఎక్కడ కూడా మిగతా వాళ్లకు ఆయన అవకాశం ఇవ్వలేదు. పైగా, తను చేసిన ప్రతి పనిని రంగనాథ్ సమర్ధించుకున్నారు. తొలిసారిగా రంగనాథ్ డిఫెన్స్ మోడ్ లో పడ్డారు. సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డారు.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

శనివారం టీవీ9 లో క్రాస్ ఫైర్ పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వ్యవహరించారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు స్కిడ్ గేమ్ మాదిరిగా సాగింది. రజనీకాంత్ ప్రశ్నలు వేయడం.. సమాధానాలు చెప్పుకునే క్రమంలో రంగనాధ్ ఇబ్బంది పడడం ఇలానే సాగిపోయింది.

రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలు.. కోర్టు కేసుల గురించి మాత్రమే మాట్లాడారు. అయితే తొలిసారిగా రజనీకాంత్ సంచలన ప్రశ్నలను.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా రంగనాథ్ పవన్ కళ్యాణ్ ను రహస్యంగా కలిసిన విధానం.. కుల సంఘాల సమావేశాలకు హాజరైన విధానం.. ప్రశ్నలను రజనీకాంత్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక రంగనాథ్ ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు కలిశారు అనే విషయంపై రంగనాథ్ క్లారిటీ ఇవ్వలేదు. కుల సంఘాల మీటింగ్ కు వెళ్లడాన్ని రంగనాథ్ సమర్ధించుకున్నారు.

కవిత ఆ మధ్య నార్సింగి ప్రాంతంలో ధర్నా చేశారు. మూసీ నదిలో కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా అధిపతి రంగనాథ్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆమె తన పార్టీ కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఆమె పకడ్బందీ ఆధారాలను కూడా చూపించారు. ఇదే విషయాన్ని రంగనాధ్ దృష్టికి రజనీకాంత్ తీసుకెళ్లగా.. వాళ్లు హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి కూల్చలేదు అని రంగనాథ్ పేర్కొన్నారు. అయితే పేదలు నిర్మించుకున్న గృహాలను ఎందుకు కూల్చివేశారని.. హైకోర్టు నుంచి పర్మిషన్లు తీసుకుంటే కూల్చి వేయరా అంటూ రజనీకాంత్ ప్రశ్నించారు. దానికి రంగనాథ్ సమాధానం చెప్పలేకపోయారు.

నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కూడా రజనీకాంత్ అడిగిన ప్రశ్నకు రంగనాథ్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు .. సున్నం చెరువులో కబ్జాలో ఉన్న అందరి ఇళ్లను కూల్చలేదని స్పష్టం చేశారు. సున్నం చెరువును ఆక్రమించిన వారిలో అందరూ ఉన్నారని.. అయితే వారి గృహాలను తాము కూల్చలేదని చెప్పారు. కేవలం నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని రజనీకాంత్ ప్రశ్నించినప్పుడు.. రంగనాథ్ సరైన సమాధానం చెప్పలేకపోయారు.. అయితే తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా పనితీరును తప్పు పడుతున్నారని రంగనాథ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ల హైదరాబాద్ నగరంలో ఎటువంటి భూమి కొనాలో ప్రజలకు అర్థమవుతోందని రంగనాథ్ పేర్కొన్నారు.

 

LIVE : Hydra Commissioner AV Ranganath Interview with Rajinikanth Vellalacheruvu | Cross Fire | TV9

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version