spot_img
Homeఎంటర్టైన్మెంట్Aditya Dhar: 'దురంధర్ 2' దర్శకుడు భారీ ఆఫర్ కొట్టేశాడా..? ఇద్దరు స్టార్ హీరోల నుంచి...

Aditya Dhar: ‘దురంధర్ 2’ దర్శకుడు భారీ ఆఫర్ కొట్టేశాడా..? ఇద్దరు స్టార్ హీరోల నుంచి పిలుపు…

Aditya Dhar: ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా దర్శకుడికి ఎక్కడ లేని క్రేజ్ తో పాటు చాలా మంది ప్రొడ్యూసర్స్ నుంచి అడ్వాన్స్ లు కూడా వస్తాయి. ఇక స్టార్ హీరోలు సైతం వాళ్ళతో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం వచ్చిన దురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక రీసెంట్ గా ‘దురంధర్ 2’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు దర్శకులు సైతం ఈ సినిమాల మీద ట్వీట్లు అయితే చేస్తున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

ఇక ఆదిత్య ధర్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం అతని వెంట పడుతున్నారట.ఇప్పటికే ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు అతన్ని కలిసి అతనితో మాట్లాడారట. వాళ్ళు ఎవరంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం…వీళ్లిద్దరూ అతనితో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది.

తొందరలోనే అతనితో సినిమాలు చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయనకి ఉన్న కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరితో సినిమాలు చేస్తారనని మాట ఇచ్చారట. మొత్తానికైతే ఈ దర్శకుడి పంట పండిందని ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ని టాప్ లెవల్లో నిల్చోబెట్టే ప్రయత్నం చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు…

ఒక రకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయింది అనుకున్నప్పుడు సంవత్సరం వ్యవధిలోనే రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీని కాపాడడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి తను ఒక సేవియర్ గా మారిపోయాడు…ఇక రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version