Hyderabad: హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టేస్టీ ఫుడ్ లో హైదరాబాద్ బిర్యానీ ఒకటి. ఇలాంటి బిర్యానీ గురించి ఇటీవల షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులోనే తయారయ్యే కొన్ని హోటల్లోని బిర్యానిలో రకరకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇష్టంగా బిర్యానీ తినేందుకు హోటల్ కు వెళ్లిన వారికి నిరాశ ఎదురవుతుంది. తాజాగా ఓ కస్టమర్ కు హైదరాబాద్ బిర్యానిలో టాబ్లెట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఖంగు తిన్న ఆయన వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ….
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హోటళ్లకు వెళ్లిన కస్టమర్లు తమకు ఎదురైన అనుభవాల గురించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓవైపు హోటళ్ళను అధికారులు పరిశీలిస్తున్నా.. మరోవైపు కొన్ని హోటల్ యజమానులు మాత్రం ఆహార వంటకాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో తినే ఆహారంలో సిగరెట్లు, కవర్లు, పురుగులు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాదులోని హోటల్ బిర్యాని లో మెడిసిన్ కు సంబంధించిన టాబ్లెట్ కవర్ బయటపడింది.
హైదరాబాదులో బావర్చి బిర్యాని ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఓ బ్రాంచీలోని బావర్చి బిర్యానీ తినడానికి ఒక కస్టమర్ వెళ్లాడు. ఈ హోటల్ లో తనకి ఇష్టమైన బిర్యాని ఆర్డర్ చేశాడు. అయితే హోటల్ సిబ్బంది తెచ్చిన బిర్యాని ప్లేట్లో మెడిసిన్ కు సంబంధించిన టాబ్లెట్ కవర్ కనిపించింది. ఆ టాబ్లెట్ కవర్ గురించి అక్కడి హోటల్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో చుట్టుపక్కల వారికి చూపిస్తూ ఫోటోలు, వీడియో తీశాడు. ఇది గమనించిన హోటల్ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఆ కస్టమర్ దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు
ఇటువంటి సంఘటనలు వరుసగా అవుతున్నాయి. గతంలోనూ బిర్యానీలో సిగరెట్లు, ఇతర కవర్లు దర్శనమిచ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలోకి వచ్చినా కొందరు పట్టించుకోవడం లేదు. అయితే ఒక్కోసారి పట్టించుకోకుండా బిర్యాని తినడం వలన ఈ వస్తువులు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల బిర్యాని తినే సమయంలో కస్టమర్లు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.
ఇదే సమయంలో హోటల్లో విషయంలో అధికారులు కఠినంగా ఉండాలని ఆహారప్రియలు కోరుతున్నారు. చాలామంది వీకెండ్ లో బిర్యాని కచ్చితంగా తినేవారు ఎంతోమంది ఉన్నారు. హోటల్ యజమానులు పట్టించుకోకపోవడంతో కొందరు వినియోగదారులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆహార వంటకంలో నాణ్యత పాటించకపోవడంతో ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చాలామంది నాణ్యతలేని ఆహారం తిని ఆసుపత్రుల పాలైన వారు ఉన్నారు. ఇదిలాగే కొనసాగితే నాణ్యతలేని ఆహారంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైనా అధికారులు బిర్యాని వండే హోటల్ పై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని నగరవాసులు కోరుతున్నారు.