Hyderabad techie tragedy: అనైతికానికి నీతి ఉండదు. నిజాయితీ అంతకంటే ఉండదు. దానికి కావాల్సింది తాత్కాలిక ఆనందం మాత్రమే. ఆ ఆనందం కోసం ఏదైనా చేస్తుంది. ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. ఇటువంటి అనైతికం మిగతా వాటిల్లో ప్రవేశిస్తే ఎంతటి ప్రభావం ఉంటుందో తెలియదు కానీ.. దాంపత్య జీవితంలో ప్రవేశిస్తే మాత్రం అతి సృష్టించే దారుణాలు ఊహకు అందవు.
ఒకప్పుడు సంసారాలలో అనైతిక కార్యకలాపాలు అంతగా ఉండేవి కావు. ఎప్పుడైతే సోషల్ మీడియా మన జీవితంలోకి వచ్చిందో.. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగం అయిపోయిందో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఒకటికి మించిన సంబంధాలు అనేవి కామన్ అయిపోయాయి. దొరికితే దొంగ.. లేకపోతే దొర అన్నట్టుగా వ్యవహారాలు సాగిపోతున్నాయి. ఇటువంటి విషయాలు బయటకు తెలియకుండా ఎక్కువ కాలం ఉండవు. ఒకసారి బయటపడితే ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.
భార్య లేదా భర్త అనైతిక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు సంసార జీవితాలు నాశనం అవుతాయి. పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. వారి జీవితాలు ఎటు కాకుండా పోతాయి. అలాంటప్పుడు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే భార్యాభర్తలు సాధ్యమైనంతవరకు తమ ధోరణి మార్చుకోవాలి. లేకపోతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో అనైతిక కార్యకాలపాలకు పాల్పడే ధోరణులు పెరిగిపోయాయి. భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం.. భర్త ఉండగానే ఇంకొకరితో వ్యవహారం సాగించడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయాయి. ఈ బంధాలు బయటపడినప్పుడు.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి భార్య లేదా భర్త చేస్తున్న ప్రయత్నాలు దారుణాలకు దారితీస్తున్నాయి. కట్టుకున్న వాళ్లను ఎటువంటి కనికరం లేకుండా చంపేలా చేస్తున్నాయి. న్యాయస్థానాలు.. పోలీసులు శిక్షలు విధిస్తారని తెలిసినప్పటికీ.. దారుణమైన చర్యలు ఉంటాయని అవగతమైనప్పటికీ ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవారు తమ ధోరణి మార్చుకోవడం లేదు.
తాజాగా హైదరాబాదులో ఒక సంఘటన జరిగింది. అతడి పేరు సీతారాం. బాచుపల్లి ప్రాంతంలో ఉంటాడు. ఇతడికి రేణుక అనే భార్య ఉంది. సీతారాం ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడు. చూసేందుకు చాలా అందంగా ఉంటాడు. రేణుక కూడా కుందనపు బొమ్మలాగా ఉంటుంది. రేణుకకు సీతారాంకు చాలా రోజుల క్రితమే పెళ్లయింది. వారి సంసార జీవితం మొదట్లో సజావుగా సాగిపోయింది. ఆ తర్వాత రేణుక దారి తప్పింది. భర్తతో కాకుండా వేరే వ్యక్తితో సంబంధం మొదలుపెట్టింది. అది సీతారాంకు తెలిసింది. ఇది తప్పని అతడు చెప్పాడు. అయినప్పటికీ రేణుక తప్పుకోలేదు. పైగా భరతమాతను లెక్కపెట్టకుండా దూకుడుగా వ్యవహరించింది. తన ప్రియుడితో కాకుండా మరొక వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుంది. ఇలా ఏకకాలంలో ఇద్దరు ప్రియుళ్ళ ను మైంటైన్ చేసింది. అదే కాదు ఒకరికి తెలియకుండా మరొకరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. వాటిని వీడియోలు కూడా తీసుకుంది.
ఆ వీడియోలు సీతారాం కంటపడ్డాయి. దీంతో అతడికుంటే పగిలింది. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు అతడు రాసిన లేఖ గుండెలను మెలిపెడుతోంది.. ” ఆమెను నేను ప్రాణంగా చూసుకున్నాను. నా ప్రేమను మొత్తం ఆమెకు పంచాను. ఇద్దరితో సంబంధం పెట్టుకుంది. నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా.. ప్రేమ ఆమెకు సరిపోదా. అసలు ఆమెకు శృంగారం మాత్రమే కావాలా. బంగారం ఇచ్చేవాడు మాత్రమే భర్త అవుతాడా.. శృంగారం కోసం ఇంత మందితో సంబంధాలు కొనసాగించాలా” అంటూ అతడు ఆ లేఖలో పేర్కొన్నాడు. సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో రేణుక, ఆమె ఇద్దరు ప్రియుళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు.