HomeతెలంగాణHyderabad Real Estate: ఐటీ ఉద్యోగులు ప్లాట్లు అమ్మేస్తున్నారా... రియల్ ఎస్టేట్ కుదేలేనా..

Hyderabad Real Estate: ఐటీ ఉద్యోగులు ప్లాట్లు అమ్మేస్తున్నారా… రియల్ ఎస్టేట్ కుదేలేనా..

Hyderabad Real Estate: మియాపూర్ నుంచి మొదలుపెడితే రాయదుర్గం వరకు.. అమీర్ పేట నుంచి మొదలు పెడితే సైబరాబాద్ వరకు.. ఎటుచూసినా సరే బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా ఆకాశాన్ని తాకే ఎత్తులో ఉంటాయి. ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారా.. ఇంతమంది జనం ఇందులో ఉంటున్నారా.. అని ఆశ్చర్యపోయే విధంగా ఆ భవనాలు కనిపిస్తుంటాయి. విల్లాలు.. గేటెడ్ కమ్యూనిటీలకు ఇక లెక్కే ఉండదు. వాస్తవానికి ఈ స్థాయిలో అక్కడ రియల్ ఎస్టేట్ జరగడానికి.. ఈ స్థాయిలో భవనాలు నిర్మాణం కావడానికి ప్రధాన కారణం ఐటీరంగం.

భారతదేశానికి ఐటీ రంగానికి రాజధానిగా బెంగళూరు ఉంటుంది. కానీ బెంగళూరు ను దాటి హైదరాబాద్ సరికొత్త అభివృద్ధిని నమోదు చేస్తోంది. డేటా సెంటర్లు.. జిసిసి.. ఫైనాన్షియల్.. బ్యాంకింగ్.. సైబర్ సెక్యూరిటీ.. మ్యానుఫ్యాక్చరింగ్.. మెడికల్ డీకోడింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఐటి పరిశ్రమలకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. జీవన వ్యయం తక్కువగా ఉండడం.. అందుబాటులోనే అన్ని వనరులు ఉండడం.. పర్యావరణపరంగా అనుకూలమైన వాతావరణం ఉండడంతో హైదరాబాద్ నగరంలో అనేక సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హైదరాబాద్ నగరంలో ట్వీన్ టవర్స్ నిర్మిస్తున్నాడు అంటే.. ఇక్కడ రియాల్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కాయిన్ కు ఒకవైపు మాత్రమే. మరో కోణం లో కనిపించని తిరోగమనం ఉంది. దీనికి ప్రధాన కారణం ఐటీ రంగంలో ఏర్పడిన అనిశ్చితి. ఉద్యోగాలు పోవడం.. కొత్త ఉద్యోగాలు లభించకపోవడం.. చాలావరకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. మిషన్ లెర్నింగ్ వంటి విధానాలను కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లభించకపోవడంతో.. చాలామంది సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో వారు కొనుగోలు చేసిన గృహాలను.. ప్లాట్లను.. ఫ్లాట్లను అమ్ముతున్నారు. కొన్ని సందర్భాలలో తక్కువ ధరకు కూడా అమ్మి సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల హైదరాబాద్ రియాల్టీ రంగం పూర్తిగా పడిపోతుంది.

హైదరాబాద్ నగరానికి రియాల్టీ రంగం ద్వారా భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు గృహాల అమ్మకం.. భూముల క్రయవిక్రయాల ద్వారా డబ్బులు వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా ఐటి ఉద్యోగులు గృహాలను అమ్మడం.. ప్లాట్లను.. ఫ్లాట్లను రీ సేల్ కు పెడుతున్న నేపథ్యంలో పరిస్థితి దారుణంగా మారింది.. ఐటీ రంగంలో మెరుగైన పరిస్థితులు ఏర్పడే తప్ప.. హైదరాబాద్ నగరంలో రియాల్టీ రంగం ఊపందుకోదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భవిష్యత్ కాలంలో ఐటిరంగం మెరుగుపడుతుందని.. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Oktelugu Epaper
Exit mobile version