Goddess Durga : మన దేశంలో గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారు.. ఆ తర్వాత దసరా ముందు దుర్గా నవరాత్రిని కూడా అంతే వైభవంగా జరుపుతారు. ప్రస్తుతం ఆ ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహానికి మన హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఇదో అద్భుతమే అని చెప్పాలి.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీనవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర ఆధ్వర్యంలో ఇసామియబజార్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఈకో ఫ్రెండ్లీ 45 అడుగుల దుర్గామాతా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవాల పోస్టర్ ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నేతలు ఇందులో పాల్గొన్నారు.
దుర్గాదేవి విగ్రహాలను మామూలుగా పాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన విగ్రహాలతోనే ఏర్పాటు చేస్తారు. కానీ ఈకో ఫ్రెండ్లీ ప్రకృతి సిద్ధ మట్టి ఇతర వాటితో తయారు చేస్తుండడం విశేషం. ఇలా చేయడం వల్ల ప్రకృతిని కాపాడడంతోపాటు భక్తిపారవశ్యాన్ని కూడా భక్తుల్లో నింపవచ్చని నిర్వాహకులు నిరూపిస్తున్నారు.
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గణపతి విగ్రహాన్ని ‘ఖైరతాబాద్’లో ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అతిపెద్ద దుర్గామాత విగ్రహానికి కూడా మన హైదరాబాద్ వేదిక కావడం విశేషం.