HomeతెలంగాణHyderabad Metro: మెట్రోను అనవసరంగా తలకెత్తుకున్న రేవంత్.. దించలేక కిషన్ రెడ్డిపై నిందలు

Hyderabad Metro: మెట్రోను అనవసరంగా తలకెత్తుకున్న రేవంత్.. దించలేక కిషన్ రెడ్డిపై నిందలు

Hyderabad Metro:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయంలో ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ, తర్వాత కేంద్రం అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ డైవర్షన్‌గా మారిందని విమర్శలు వస్తున్నాయి. అయితే వాస్తవాలు, ఆర్థిక సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది.

మెట్రో టేకోవర్‌ నేపథ్యం..
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1ను ఎల్‌అండ్‌టీ నిర్వహిస్తోంది. ఇది నష్టాల్లో ఉండటం, ఆర్థిక భారం కారణంగా లీజ్‌ వదులుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుని, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ద్వారా 100 శాతం ఈక్విటీని సొంతం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.1,461 కోట్లు ఖర్చు అయింది. ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన బకాయిలు, రుణాలు క్లియర్‌ చేయడం ఈ టేకోవర్‌కు ముఖ్య కారణం. ఇది ఫేజ్‌–2 విస్తరణకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎవరూ సూచించకుండానే టేకోవర్‌ చేశారని, రాజకీయ నేపథ్యం ఉందని విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వంపై రుణ భారం..
రూ.13,600 కోట్ల వరకు ఉన్న రుణాలు, ఇవి ఇంతకు ముందు బ్యాంకుల నుంచి 8.25% వడ్డీకి తీసుకున్నవి. ప్రభుత్వం ఇప్పుడు ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) ద్వారా రీఫైనాన్సింగ్‌ చేయాలని చూస్తోంది. దీనిలో 4% వడ్డీకి జపాన్‌ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నిబంధనల ప్రకారం రుణం తీసుకోవాలని సూచిస్తోంది. ఇలా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది. ఉద్యోగుల జీతాలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కొరత ఏర్పడవచ్చు. రాష్ట్ర హామీతో రుణం తీసుకుంటే అది రాష్ట్ర బడ్జెట్‌పై భారం అవుతుంది. ఇది టేకోవర్‌ను ఆర్థికంగా సవాలుగా మార్చింది.

సెకండ్‌ ఫేజ్‌ కోసం డిమాండ్‌..
మెట్రో ఫేజ్‌–2 (సుమారు 123 కి.మీ.,రూ.38,595 కోట్లు) కోసం రేవంత్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు, ఆమోదాలు కోరుతున్నారు. ఇంతకు ముందు 50:50 భాగస్వామ్యంగా ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. కానీ యూనియన్‌ మినిస్టర్‌ గిరి కిషన్‌ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అసలు ఉద్దేశం బకాయిలు చెల్లించడం..
ఫేజ్‌–2కు నిధులు తీసుకురావడం ద్వారా టేకోవర్‌ బకాయిలు చెల్లించాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. కిషన్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు, ఆర్థిక బాధ్యతలు తీసుకోవడం లేదు అని ఆరోపిస్తున్నారు. వాదనలు వస్తున్నాయి. ఇది కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో భాగమైంది.

ప్రజా రవాణా మెరుగుపర్చాలని..
మెట్రో ఫేజ్‌–2 విస్తరణ ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించవచ్చు. అయితే ఆర్థిక భారం, రుణాలు, కేంద్ర నిబంధనలు ఇది సులభం కాదని చూపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం టేకోవర్‌ను గొప్ప విజయంగా చిత్రించి, తర్వాత కేంద్రం మీద బాధ్యత వేయడం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో కిషన్‌రెడ్డి, కేంద్రం వైపు నుంచి రాష్ట్రం నిబంధనలు పాటించాలని, ఆర్థిక బాధ్యత తీసుకోవాలని ఒత్తిడి చేయడం సహజం. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్రాలు కలిసి చేయాల్సినది. రాజకీయ ఆరోపణలు, డైవర్షన్‌లు పక్కన పెట్టి, ఆర్థిక వాస్తవాలు, ప్రజా ప్రయోజనం ఆధారంగా ముందుకు సాగాలి. హైదరాబాద్‌ వంటి నగరానికి మెట్రో విస్తరణ అవసరం ఉంది, కానీ అది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా జరగాలి.

ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో రాజకీయాలు అనివార్యం. కానీ ప్రజలు ఫలితాలు చూడాలని కోరుకుంటారు. మెట్రో విస్తరణ, మెరుగైన రవాణా. రెండు పక్షాలు సహకరించి, సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే ఈ టేకోవర్‌ నిజమైన అభివృద్ధికి దారితీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version