https://oktelugu.com/

Hyderabad Metro: ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. మెట్రో, ఆర్టీసీ సేవలు పొడిగింపు..

ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. నాగోల్, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు అర్ధరాత్రి 13:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 25, 2024 / 03:48 PM IST

    Hyderabad Metro

    Follow us on

    Hyderabad Metro: హైదరాబాద్‌ వాసులకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. గురువారం(ఏప్రిల్‌ 25న) ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగనుంది. రాయల్‌ ఛాలెంజర్‌ బెంగళూరు – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.

    సమయం పెంపు..
    ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. నాగోల్, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు అర్ధరాత్రి 13:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియంలో ఏ మ్యాచ్‌ జరిగినా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

    ఆర్టీసీ అదనపు బస్సులు..
    ఇక ఆర్టీసీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు 60 బస్సులు అదనంగా తిప్పనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సులు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.