Chiranjeevi high court: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి హైకోర్టు(High Court) రిలీఫ్ ఇవ్వడం ఏంటి?, అసలు ఏమి జరిగింది?, వివాదాలకు దూరం గా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి అసలు హై కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాడు? వంటివి ఇప్పుడు మనం చూద్దాం. వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటిని పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరించాలంటూ GHMC ని చిరంజీవి రిక్వెస్ట్ చేశాడు. కానీ GHMC అందుకు అనుమతించలేదు. దీంతో చిరంజీవి హై కోర్టు లో ఈ అంశంపై పిల్ వేసాడు. ఇరు వర్గాల వాదనలు ఉన్న న్యాయమూర్తి,చిరంజీవి కి అనుకూలంగా తీర్పు ఇస్తూ, చట్టప్రకారం క్రమబద్దీకరించి తక్షణమే GHMC ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశిస్తూ పిటీషన్ ని క్లోజ్ చేసింది. అలా మెగాస్టార్ చిరంజీవి కేసు గెలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాల స్పీడ్ పెంచడం వెనక అసలు కారణం ఇదేనా..?
మరి GHMC కోర్టు ఆదేశాలను అనుసరించి ఉత్తర్వులు జారీ చేస్తుందో లేదో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, విశ్వంభర(Vishwambhara Movie) మూవీ షూటింగ్ కేవలం ఒక ఐటెం సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో చేస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగతూనే ఉంది. అనిల్ రావిపూడి తో చేస్తున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఏ సినిమాకు ‘మన శివ సంక్రాంత వరప్రసాద్ గారు\’అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో మెగాస్టార్ ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టర్ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోష్గిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు .