Pawan Kalyan 2025 films: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు… ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నాడు. ఇక ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నింటిని శరవేగంగా పూర్తి చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటికే ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఇక పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Singh) సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేస్తారట. అలాగే పాలిటిక్స్ లో తను నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలానే ఉన్నాయట…ఎలక్షన్స్ అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నింటిని సక్రమమైన రీతిలో ప్రజలందరికి పథకాలు అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయడానికి ఆయన విపరీతంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటుగా ఫ్యూచర్ మొత్తం జనసేన పార్టీని బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆ జెండాను ఎగరేయడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇకమీదట సినిమాలు చేయకపోవచ్చు…
Also Read:చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు చేసిన తప్పేంటి..?
ఇక 2024 ఎలక్షన్స్ కి ముందు కమిట్ అయిన సినిమాలు చేసి ప్రొడ్యూసర్లకి భారంగా మారకూడదనే ఉద్దేశ్యంతోనే వాటన్నింటిని కంప్లీట్ చేస్తున్నాడు. ఇక ఈనెల 24వ తేదీన హరి హర వీరమల్లు (Hari hara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఈ సినిమా తర్వాత ఓజి (OG) సినిమాని సైతం సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాడవుతాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది…
Also Read: ‘వార్ 2’ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశం చూస్తే ‘మొత్తం పోతారట!
చూడాలి మరి పవన్ కళ్యాణ్ చేసే ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి…పాన్ ఇండియాలో ఆయనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెడతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమానే ఆయనకు చివరి సినిమా అవ్వబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…