HomeతెలంగాణHe almost Doubled It: దాదాపు డబుల్ చేశాడు.. ఈ క్రెడిట్ ఖచ్చితంగా కేసీఆర్ దేనా?

He almost Doubled It: దాదాపు డబుల్ చేశాడు.. ఈ క్రెడిట్ ఖచ్చితంగా కేసీఆర్ దేనా?

He almost Doubled It: ఒకప్పుడు తెలంగాణలో పశుసంపద చాలా తక్కువ. మాంసం కోసం చాలా వరకు దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పశుసంపదకు చాలా వరకు ప్రియారిటీ ఇచ్చారు. సబ్సిడీలపై పశువులను అందించి ప్రోత్సహించారు. వాటి కోసం రకరకాల పథకాలను అమలు చేశారు. వాటి ద్వారా రైతులను ప్రోత్సహించారు. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పశుసంపద పెరిగిపోయింది. గత పదేళ్లకు ఇప్పటికి లెక్కలు చూస్తే వామ్మో ఇంత తేడానా అనే పరిస్థితి వచ్చింది.

కేంద్ర గణాంక, కార్యక్రమాల శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం లెక్కలను చూస్తే ఏ మేరకు వృద్ధి సాధించారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం ఏర్పాటయ్యాక పశుసంపద తెలంగాణలో గణనీయంగా పెరిగిందని, వాటి విలువ రూ.2వేల కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అలాగే.. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లోనూ రాష్ట్రం వృద్ధి సాధించినట్లు తెలిపింది. విడుదల చేసిన నివేదికలో పశుసంపద, గుడ్లు, పాలు, మాంసం ఉత్పత్తులకు సంబంధించి గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పదేళ్లలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వృద్ధి సాధించింది. దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగినట్లు స్పష్టమైంది.

కేంద్ర గణాంకాల ప్రకారం 2022-23 నాటికి తెలంగాణలో పశుసంపద విలువ రూ.4,789,09 కోట్లుగా నమోదైంది. రాష్ట్రం ఏర్పటైన 2014-15లో రూ.2,824.57 కోట్లు మాత్రమే ఉంది. అటు గుడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం వృద్ధి రేటు చాలా వరకు బెటర్‌గా ఉంది. 2014-15లో రూ.228.97 కోట్ల విలువైన గుడ్లను తెలంగాణ ఉత్పత్తి చేయగా.. 2022-23 నాటికి రూ.381.04 కోట్లకు పెరిగింది. ఇక మాంసం ఉత్పత్తుల విషయానికి వస్తే పదేళ్లలోనే గణనీయ వృద్ధి సాధించినట్లు గణాంకాలు తెలిపాయి. 2014-15లో మాంసం ఉత్పత్తుల విలువ రూ.1,484.05 కోట్లు కాగా.. 2022-23నాటికి అది ఏకంగా రూ.5,531.85 కోట్లకు పెరిగింది. అయితే.. పశుసంపద గణనీయంగా పెరిగినప్పటికీ పాల ఉత్పత్తిలో మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. 2014-15లో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో పాల ఉత్పత్తుల విలువ రూ.1,350.69 కోట్లు ఉండగా.. 2022-23కు వచ్చేసరికి రూ.1,874.28 కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటులో కాస్త తక్కువగానే అనిపించింది. అయితే.. రాష్ట్రం పదేళ్లలోనే ఈ స్థాయిలో పశుసంపద వృద్ధి సాధించడానికి కేసీఆరే కారణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అప్పుడు అమలైన సబ్సిడీ స్కీమ్‌ల వల్ల ఇదంతా సాధ్యపడిందనే అభిప్రాయం వారిలో వెల్లడైంది. ప్రధానంగా గొర్రెల పంపిణీ పథకం ద్వారా 3.94 లక్షల యూనిట్లను అందించారు. మరోవైపు.. రైతులను మరింత ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహకం అందించింది. 2014 నుంచి పాడి రైతులకు ఈ ప్రోత్సాహకం అందుతోంది. మరోవైపు.. పశువులకు వైద్యసేవల కోసం సంచార వైద్యశాలలను ప్రారంభించి ప్రోత్సహించారు. ఇలా కేసీఆర్ హయాంలో పశుసంపదన ప్రోత్సహించడంతో ఈ పదేళ్లలో ఈ అభివృద్ధి సాధ్యమైందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version