HCU Land Dispute
HCU Land Dispute: వారం రోజులుగా కంచె గచ్చిబౌలి(Kanche Gachibouli)లోని 400 ఎకరాల భూవివాదం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 400 ఎకరాల్లో చెట్లు నరికడంపై ఇప్పటికే విపక్షాలు, హెచసీయూ(HCU) విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు కూడా చెట్లు నరకడంపై స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీ కోర్టు కూడా జోక్యం చేసుకుంది.
Also Read: రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు చేరింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున చెట్లు నరికివేస్తున్నారన్న ఫిర్యాదు సుప్రీం కోర్టు(Supream Court)కు అందడంతో గురువారం (ఏప్రిల్ 3, 2025) న్యాయస్థానం స్పందించింది. ఈ వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నం 3:45 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. అంతలోపు, ఈ భూమిని వెంటనే సందర్శించి, మధ్యాహ్నం 3:30 గంటల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను(Telangana High court Rigistrar) సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఒక్క చెట్టును కూడా నరకొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వరుస సెలవులతో..
ఈ వివాదంలో వరుసగా మూడు రోజుల సెలవుల సమయంలో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ(HCU) భూముల్లో వేలాది చెట్లను నరికేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీం కోర్టుకు ఫిర్యాదు అందడంతో విచారణకు సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ భూమి 30 ఏళ్లుగా వివాదంలో ఉందని, ఇది అటవీ భూమి అనడానికి ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
హైకోర్టులో కూడా విచారణ..
మరోవైపు, తెలంగాణ హైకోర్టులో కూడా ఈ వివాదంపై ఇవాళ విచారణ జరగనుంది. వట ఫౌండేషన్(VATA Foundation), హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)పై బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం, గురువారం వరకు భూమిపై ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశించింది. విద్యార్థులు, పర్యావరణవాదులు ఈ భూమిని అటవీ ప్రాంతంగా ప్రకటించాలని, దీన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చాలని కోరుతున్నారు. ఈ భూమిలో గల సమృద్ధమైన జీవవైవిధ్యం, అరుదైన వక్షజాతులు, వన్యప్రాణులను కాపాడాలని వారి డిమాండ్.
ప్రభుత్వం మాత్రం ఈ భూమిని ఐటీ పార్క్‌ల కోసం వినియోగించాలని భావిస్తోంది. దీనిపై విద్యార్థులు, పర్యావరణ సంస్థలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలతో ఈ వివాదం కీలక మలుపు తిరిగింది. రాబోయే విచారణలు ఈ భూమి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hcu land dispute supreme court orders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com