Harsh Rao : ఉద్యమ పార్టీకి పాత రోజులు గుర్తుచేస్తున్న హరీశ్ రావు

గాంధీ, కౌశిక్‌ల మధ్య నెలకొన్న వివాదం చివరకు అరెస్టుల వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య సవాళ్లతో చివరకు ఇరువర్గాలు దాడు చేసుకునే స్థాయికి చేరాయి. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వీరి వైఖరిపై హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతూనే ఉంది.

Written By: Chai Muchhata, Updated On : September 13, 2024 2:21 pm

Harish Rao

Follow us on

Harsh Rao :  తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చిలికిచిలికి గాలి వానలా మారింది. దాంతో నిన్న హైదరాబాద్ పరిధిలో టెన్షన్ వాతావరణం కనిపించింది. నిమిషం నిమిషానికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగింది.

గాంధీ, కౌశిక్‌ల మధ్య నెలకొన్న వివాదం చివరకు అరెస్టుల వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య సవాళ్లతో చివరకు ఇరువర్గాలు దాడు చేసుకునే స్థాయికి చేరాయి. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వీరి వైఖరిపై హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతూనే ఉంది.

ఇదే క్రమంలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేరు తెరమీదకు వచ్చింది. హరీశ్ రావు మంచి టైమింగ్ ఉన్న నేత. అందుకే ఆయనను ఇతర పార్టీల నేతలు కూడా ఇష్టపడుతుంటారు. గతంలోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హరీశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీలో మంచి నేత ఉన్నది అంటే అది వన్ అండ్ ఓన్లీ హరీశ్ రావు అంటూ కితాబిచ్చారు. అంతేకాకుండా.. హరీశ్‌కు ట్రబుల్ షూటర్ అనే పేరు కూడా ఉంది. పార్టీకి ఏ కష్టం వచ్చినా.. ఏ సమస్య వచ్చినా తన స్టైల్‌లో నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యను లేకుండా చేస్తారని అంటుంటారు. అందుకే.. ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యం కూడా తెలియనిది కాదు.

అయితే.. నిన్న రోజంతా హైదరాబాద్‌లో గాంధీ వర్సెస్ కౌశిక్ అన్నట్లుగా పెను దుమారం కొనసాగింది. గాంధీ తన అనుచరవర్గంతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం.. అక్కడ ఇంటిపై దాడి చేయడం.. ఇరు వర్గాల నేతలు దాడులకు పాల్పడడం చూశాం. ఈ క్రమంలో పోలీసులు కలుగజేసుకొని గాంధీని అరెస్ట్ చేశారు. ఆయనను స్టేషన్‌కు తరలించారు.

దాంతో సమస్య ఇక సమసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ.. అంతలోనే ట్రబుల్ షూటర్ హరీశ్ ఎంట్రీ ఇచ్చారు. కౌశిక్ దూకుడుకు హరీశ్ తోడయ్యారు. హుటాహుటినా సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోనే సిటీ ఎమ్మెల్యేలు సైతం వెంటయ్యారు. ఆయనతోపాటే అందరూ కలిసి కౌశిక్ ఇంటికి చేరుకున్నారు.

ఆ వెంటనే కమిషనరేట్‌కు వెళ్లడం.. అక్కడ ఆందోళనకు దిగడం వెంటవెంటనే జరిగిపోయాయి. అక్కడికి చేరుకునే లోపే పది వేల మందికిపైగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలంటూ ఆయన పిలుపునివ్వడం కూడా హరీశ్ టైమింగ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఈ ఎపిసోడ్‌పై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అమెరికా టూర్‌లో ఉన్నారు. దాంతో హరీశ్ రావుకు కూడా ఈ టైమింగ్ కలిసివచ్చిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా హరీశ్ కూడా ఈ ఉదంతంలో దూకుడు ప్రదర్శించారు. చివరకు ఆయనను అరెస్టు చేయడం.. రాత్రి వరకు పోలీస్ వాహనాల్లోనే తిప్పుతూ స్టేషన్‌కు తరలించడం జరిగింది. ఆ క్రమంలో జరిగిన తోపులాటలూనే ఆయన భుజానికి గాయమైంది. ఇదంతా చూస్తే కేసీఆర్, కేటీఆర్ సైలెంట్ అయిన పక్షంలో హరీశ్ ఈ టైమింగును బాగా వాడుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒకవిధంగా చెప్పాలంటే నిన్నటి ఎపిసోడ్‌ను గత తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో కనిపించిన తెగువ మరోసారి హరీశ్‌లో చూశామని.. పార్టీకి పెద్ద దిక్కులా మారాడని అభిప్రాయపడుతున్నారు. మరోసారి ఉద్యమ పార్టీ అంటే ఏంటో సత్తా చూపారని చెబుతున్నారు.