KCR – Himanshu : తాత కేసీఆర్ కోసం మనవడు హిమాన్షు భారీ ఛేజింగ్.. చివరకు అదిరిపోయే సర్ ప్రైజ్

పై చదువుల కోసం అమెరికా వెళ్లిన హిమాన్షు.. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తిరిగివచ్చాడు. ఈ క్రమంలో తన తాతయ్యను కలిసేందుకు ఫామ్ హౌస్ వెళ్ళాడు. అక్కడ ఆయన లేకపోవడం.. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బస్సు యాత్ర చేస్తున్నారని తెలుసుకొని..

Written By: NARESH, Updated On : May 23, 2024 9:46 pm

Grandson Himanshu is a huge chase for KCR

Follow us on

KCR – Himanshu : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనవడు హిమాన్షు రావు అంటే చాలా ప్రాణం. తన కల్వకుంట్ల వంశ వారసుడి పై తనకున్న ఇష్టాన్ని కేసీఆర్ చాలాసార్లు ప్రదర్శించారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రోటోకాల్ పక్కనపెట్టి.. శ్రీరామనవమికి అతడి ద్వారా స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పంపించారు. ప్రగతిభవన్ లో అతడి తో సందడి చేసేవారు. తనకు ఒత్తిడిగా అనిపించినప్పుడు, మనసు బాగోలేనప్పుడు.. ఫామ్ హౌస్ కు తన మనవడిని పిలిపించుకునేవాడు. అతడితో మనస్ఫూర్తిగా మాట్లాడేవాడు. అతడు చెప్పిన విషయాలు మొత్తం వినేవాడు. మనసు తేలిక పడిన తర్వాత మనవడిని మళ్లీ తన కొడుకు కేటీఆర్ వద్దకు పంపేవాడు.

కానీ, ఇప్పుడు కేసీఆర్ కు అధికారం లేదు. ముఖ్యమంత్రి హోదా లేదు. దేశంలో చక్రం తిప్పుదాం అనుకుంటే.. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. ఆంధ్రప్రదేశ్లో షట్టర్లు బిగించారు.. తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు. బీహార్లో నితీష్ కుమార్ బిజెపి వైపు వెళ్లిపోయాడు. కర్ణాటకలో కుమారస్వామి భవితవ్యం ఏమిటో తెలియడం లేదు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. చేయి కలిపిన పాపానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్ జైలు కూడు తిని వచ్చాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కు ఎదురైన వైఫల్యాలు.. తగిలిన దెబ్బలు మామూలివి కావు. చివరికి కన్న కూతురు కూడా లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్ళింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కు సాంత్వన కావాలి. అలాంటి సాంత్వన ఇచ్చే నాయకుడు భారత రాష్ట్ర సమితిలో లేడని చాలామంది అంటారు. అప్పట్లో కేశవరావు నీడలాగా ఉండేవాడు. అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ నీడను వెతుక్కుంటూ వెళ్ళాడు. సో, కేసీఆర్ మనసు తెలుసుకొని.. మనసు తేలిక చేసి మాట్లాడే వారు ఎప్పుడొస్తారోననిభారత రాష్ట్ర సమితి నాయకులు ఎదురు చూస్తుంటే.. అదిగో అప్పుడు వచ్చాడు సినిమా హీరోలాగా హిమాన్షురావు.

పై చదువుల కోసం అమెరికా వెళ్లిన హిమాన్షు.. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తిరిగివచ్చాడు. ఈ క్రమంలో తన తాతయ్యను కలిసేందుకు ఫామ్ హౌస్ వెళ్ళాడు. అక్కడ ఆయన లేకపోవడం.. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బస్సు యాత్ర చేస్తున్నారని తెలుసుకొని.. ఓ వాహనంలో ఆయన బస్సును అనుసరించాడు. సినిమా హీరోలాగా ఛేజింగ్ చేసి.. చివరికి ఎలాగోలా తన తాతయ్య ప్రయాణిస్తున్న బస్సులోకి ఎక్కాడు. తాతయ్యకు ఒక్కసారిగా సర్ ప్రైజ్ ఇచ్చాడు. “హాయ్ తాతయ్య.. ఎలా ఉన్నారు” అని హిమాన్షు అంటే..” ఎప్పుడొచ్చినవ్ రా..” అని కెసిఆర్ బదులిచ్చారు. ” మిమ్మల్ని సర్ ప్రైజ్ చేద్దామని బస్సులోకి వచ్చాను.. చాలాసేపటి నుంచి మీ కాన్వాయ్ ఫాలో అవుతున్నాను. చివరికి ఛేజింగ్ చేసి వచ్చాను” అని హిమాన్షు రావు పేర్కొన్నాడు. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా లో పోస్ట్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.