https://oktelugu.com/

Ranbir Kapoor : రన్బీర్ కపూర్ తో సినిమాకి సిద్ధమైన స్టార్ డైరెక్టర్….

ఇక మొత్తానికైతే ఆయనతో పాటు పోటీ పడి నటించే నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు లేరనే చెప్పాలి. మన స్టార్ హీరో అయిన మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారికి కూడా రన్బీర్ కపూర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం...అందుకే ఆయన బాలీవుడ్ లో చాలా సపరేట్ ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2024 / 09:40 PM IST

    Anurag-Kashyap-Ranbir-Kapoor

    Follow us on

    Ranbir Kapoor : బాలీవుడ్ ఇండస్ట్రీలో రన్బీర్ కపూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమాతో మరోసారి తనని తాను స్టార్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో నటించడం కూడా చాలా అద్భుతంగా ఉండడంతో ఆయనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అయితే దక్కాయి.

    ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన అనురాగ్ కశ్యప్ తాజాగా రన్బీర్ కపూర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే రన్బీర్ కపూర్ ప్రస్తుతానికి రామాయణం సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అనురాగ్ కశ్యప్ తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనేది దాని మీద కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక మంచి విజయాలుగా మారడమే కాకుండా ఆయనకు చాలావరకు ప్లస్ అయింది. ఇక అనిమల్ సినిమాతో ఆయనకు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఏర్పడింది.

    ఇక దాంతో తను చేయబోయే సినిమా కూడా తెలుగులో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతకుముందు రన్బీర్ కపూర్ అంటే సగటు సామాన్య తెలుగు సినిమా అభిమానులకు తెలిసేది కాదు. కానీ ఒక్కసారి అనిమల్ సినిమా వచ్చిన తర్వాత ఆయన అందులో నటించిన నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.

    ఇక మొత్తానికైతే ఆయనతో పాటు పోటీ పడి నటించే నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు లేరనే చెప్పాలి. మన స్టార్ హీరో అయిన మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారికి కూడా రన్బీర్ కపూర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం…అందుకే ఆయన బాలీవుడ్ లో చాలా సపరేట్ ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు…