Mixed Toddy: హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఇటీవల కల్తీ కళ్ళు తాగి 9 మంది మృతి చెందిన విషయం విషాదాన్ని కలిగించింది. దీంతో కల్తీ కల్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కల్లుకు ఎంతో గుర్తింపు ఉంది. కొన్ని పండుగల్లో ప్రత్యేకంగా కల్లు తప్పనిసరిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ప్రతిరోజు తాటి లేదా ఈత కల్లు తాగకుండా ఉండలేరు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కల్లు విలువ గుర్తించిన ప్రభుత్వం సైతం హైదరాబాదులో నీర సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం కల్తీ కల్లు వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా కల్లు కు గుర్తింపు వస్తున్న నేపథ్యంలో కొందరు అక్రమంగా దీనిని కల్తీగా తయారుచేసి విక్రయిస్తున్నారు. తమ సంపాదన కోసం ఇందులో ఏవేవో పదార్థాలు కలుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీటి వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోతున్నాయి. అందుకు నిదర్శనమే తాజాగా కూకట్ పల్లి లో జరిగిన సంఘటనే. అయితే కల్తీ కల్లు తో 9 మంది చనిపోయిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కల్లు డిపోలపై దాడులు నిర్వహించి.. కల్తీ కల్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
అయినా ఈ డిపోలను మూసివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిపోలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కల్లు డిపోలను మూసివేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? అనే విషయంపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ డిపోల స్థానంలో స్వచ్ఛమైన కల్లు విక్రయించేలా చర్యలు తీసుకోవడమా? అనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కల్లు డిపోలను ఒకేసారి మూసి వేయడం ద్వారా కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే కల్లు కు బానిస అయిన వారు ఎంతోమంది ఉన్నారు. వీరికి ప్రతిరోజు కల్లు లేకపోతే మతిస్థిమితం కోల్పోయే అవకాశం కూడా ఉంది. గతంలో కరోనా సమయంలో కల్లు డిపోలను మూసివేయడం వల్ల ఎంతోమంది ఆందోళన చెందారు. మతిస్థిమితం లేక పిచ్చిగా వ్యవహరించారు. అందువల్ల ఒకేసారి కల్లు డిపోలను మూసివేయడం ద్వారా జరిగే పరిణామాలు ఏంటి? అనేది కూడా ఆలోచిస్తున్నారు.
అయితే మొత్తంగా కల్తీ కల్లు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా సాధ్యం కాని పక్షంలో కొన్ని డిపోలను మూసివేసే అవకాశం ఉందని సమాచారం. అయితే కొన్ని సంఘాల నుంచి మాత్రం కల్లు డిపోలో బ్యాన్ చేయాలని ఆందోళన చేస్తున్నాయి. గతంలోనూ కల్తీ కల్లు తో చాలామంది మరణించారని.. ఇది ఇలాగే కొనసాగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..