Telangana Rythu Bharosa Funds Released Today : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది యాసంగి నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు జనవరి 26(January 26)న ప్రారంభించింది. 27వ తేదీన ఎంపిక చేసిన గ్రామాల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. అయితే తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయింది. అయితే ఎలక్షన్ కమిషన్(Election Comission) అభ్యంతరం చెప్పకపోవడంతో మళ్లీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. రెండు రోజుల క్రితం రెండెకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. మొత్తం 11,79,247.17 ఎకరాల భూములకు 8,65,999 మంది రైతులకు 7,07,54,84,664 రూపాయలు అందిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది.
జనవరి 27న ప్రారంభం..
ప్రభుత్వం జనవరి 27న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 577 గ్రామాల్లోని రైతులకు పైలట్ ప్రాజెక్టు(Poilet Project) కింద రైతు భరోసా డబ్బులు జమ చేసింది. ఈ క్రమంలో 9,48,332,35 ఎకరాలకు 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.5,68,99,97,265 జమయ్యాయి. ఫిబ్రవరి 5వ తేదీలోపు 9,29,234.20 ఎకరాలకు సంబంధించిన 17,03,419 మంది రైతుల ఖాతాల్లో రూ.5,57,54,07,019 జమ చేశారు.
ఫిబ్రవరి 12 నుంచి మూడెకరాలకు..
ఫిబ్రవరి 12(బుధవారం) నుంచి మూడు ఎకారల భూమి ఉన్న రైతుల ఖాతాలో‍్ల రైతు భరోసా డబ్బులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. సాగు చేస్తున్న భూమిని (ఎకరాల్లో) బట్టి వరుసగా పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. మార్చిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేశారు.
ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే..
ప్రస్తుతం రెండు ఎకారలలోపు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం రైతు భరోసా(Raithu Bharosa) నిధులు జమ చేసింది. దశల వారీగా మిగతా రైతులందరికీ సాయం అందించనుంది. అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే సంబంధిత ఏఈవో లేదా ఏవోలను సంప్రదించాలి. ఏదైనా పొరపాటు ఉంటే సరిచేస్తారు. తర్వాత డుబ్బలు జమవుతాయని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ పెట్టుబడి సాయం అందే అవకాశం ఉన్నట్లు సమాచారం..