దేశంలో బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. కరోనా వ్యాక్సిన్ గురించి వెలువడుతున్న శుభవార్తల వల్ల గత కొన్ని రోజుల నుంచి బంగారం ధర తగ్గుతుండగా ఈరోజు కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టడం గమనార్హం. అయితే బంగారం ధర తగ్గుముఖం పడుతున్నా వెండి ధరలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. పసిడి ధర పతనమవుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు
హైదరాద్ మార్కెట్ లో బంగారం ధరలను పరిశీలిస్తే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 650 రూపాయలు తగ్గింది. ఏకంగా 24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయలు క్షీణించడంతో మార్కెట్ లో బంగారం ధర 49,750 రూపాయలకు చేరగా 22 గ్రాముల బంగారం ధర ఏకంగా 600 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం తులం 22 గ్రాముల బంగారం ధర 45,600 రూపాయలుగా ఉంది. బంగారం ధర అంతకంతకూ తగ్గుతుంటే వెండి ధర మాత్రం పెరుగుతుండటం గమనార్హం.
Also Read: పీవీ, ఎన్టీఆర్‌లను వదలని ‘కాషాయ’ దండు
రోజురోజుకు నాణేల తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గుతుండగా వెండికి డిమాండ్ పెరుగుతుండటంతో బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. వెండి ధర ఈరోజు ఏకంగా 300 రూపాయలు పెరిగి 64,800 రూపాయలకు చేరడం గమనార్హం. అయితే దేశీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గుతున్నా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పెరుగుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం :తెలంగాణ పాలిటిక్స్
ఔన్స్ కు 0.15 శాతం పెరుగుదలతో బంగారం ధర 1808 డాలర్లకు చేరగా బంగారం ధర పెరిగిన విధంగానే వెండి ధర కూడా పెరగడం గమనార్హం. వెండి ధర ఔన్స్ కు 0.22 శాతం పెరగగా 23.41 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరగడానికైనా, తగ్గడానికైనా అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాలు కారణమని చెప్పవచ్చు.