తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక ఆ పార్టీకి చాలావరకు ఊపొచ్చింది. ఇప్పుడు పొలిటికల్‌గానూ బండి బాగా ఫామ్‌లో ఉన్నారు. అధికార పక్షంతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నాడు. గ్రేటర్ ఎన్నికల మొత్తం షెడ్యూల్ కేవలం రెండు వారాలు. అయినా ఏమాత్రం తడబాటుకు గురికాకుండా బీజేపీ తనదైన శైలిలో ప్రచారం దూసుకెళ్తోంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
Also Read: కేసీఆర్ వెనక్కి తగ్గినట్లేనా?
నామినేషన్ల టైంలో వరద సాయం ఆపడానికి బండి సంజయే కారణం అంటూ ఓ ఫేక్ లెటర్ సృష్టించారు. అయినా.. సంజయ్ ఏమాత్రం జంక లేదు కాదు కదా వెంటనే కౌంటర్ ఇచ్చేశాడు. దాన్నే అస్త్రంగా చేసుకుని పార్టీని పాతబస్తీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత కూడా ఆయన దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. నిర్మోహమాటంగా తాను హిందూత్వ వాదినేనని చెప్పుకుంటూ.. మజ్లిస్‌పై డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు.
ఏకంగా.. పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీఆర్ఎస్ కూడా ఆయన ట్రాప్‌లో పడింది. దీన్ని వివాదాస్పదం చేయాలనుకుంది. కానీ.. అది మరో విధంగా హైలెట్ అయింది. ఈ సారి అక్బరుద్దీన్.. బండి సంజయ్ కు చాన్సిచ్చారు. అనాలోచితంగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత గురించి మాట్లాడారు. ఇక బండి సంజయ్ ఊరుకుంటారా..? నిజానికి ఆ ఇద్దరూ బీజేపీతో సంబంధం లేని వాళ్లే. అలా అని బండి సంజయ్ రిజర్వేషన్లు పెట్టుకోలేదు. ఇద్దరికీ కాషాయం రంగు పూసి మహానుభావులుగా వాడకం ప్రారంభించేశారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని కూల్చుతారా?.. అయోధ్య అంశంపై పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని కూల్చుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: తిరుపతి బరి: గెలిచే సత్తా ఎవరికుంది?
అంతేకాదు.. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు నివాళులర్పిస్తామని, మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటామని ప్రమాణం కూడా చేయబోతున్నారట. అటు టీడీపీ ఫ్యాన్స్‌ని ఇటు పీవీకి మద్దతుగా ఉండే కాంగ్రెస్ ఫ్యాన్స్‌ని బండి సంజయ్ ఏక కాలంలో ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా తమ పార్టీకి చెందని వారిని ఇతర పార్టీలు ఓన్ చేసుకోవు. కానీ బీజేపీ స్టైలే వేరు. అందులోనూ.. బండి సంజయ్ స్టైల్ ఎవరికీ అర్థం కాకుండానే ఉంది. సర్దార్ పటేల్ ను బీజేపీ ఓన్ చేసుకున్న విధానం చూసి బహుశా.. ఆయన బీజేపీ నేత అయి ఉండవచ్చని అనుకునే జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సంజయ్ పీవీ, ఎన్టీఆర్‌ల విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్