Telangana State 5 Lakh Crore GO Leak: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వు (GO) ముసాయిదా (Draft) దశలోనే లీక్ కావడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారాన్ని లీక్ చేసిన వారిని త్వరలోనే పట్టుకొని తప్పకుండా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
సచివాలయంలో ఆర్డర్ల మాయంపై ఆరా: నిగ్గు తేల్చే పనిలో ఇంటెలిజెన్స్
డ్రాఫ్ట్ దశలో ఉన్న ముఖ్యమైన ఆర్డర్లు, జీవోలు సచివాలయం నుంచి మాయమై, అవి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుతుండటాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ లీకుల వెనుక ఎవరున్నారు? సమాచారాన్ని ఎక్కడి నుంచి బయటికి పంపుతున్నారు? అనే అంశాలపై సమగ్ర విచారణ ప్రారంభించిన ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా ఆరా తీస్తోంది.
లీకు వీరులెవరు?
డ్రాఫ్ట్ దశలో బయటికి ఎలా పోతున్నాయి? బీఆర్ఎస్ కు సమాచారం ఇస్తున్నదెవరు? అన్నది నిగ్గుతేల్చే పనిలో ప్రభుత్వం పడింది.
కేటీఆర్ ఆరోపణలు, మంత్రి కౌంటర్
ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫార్మేషన్ పాలసీ’ వెనుక 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ. 50 వేల కోట్లను ముఖ్యమంత్రి తన జేబులో వేసుకోవాలని చూస్తున్నారని, ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం అని విమర్శించారు. దీనిపై కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు… తాము ఎలాంటి కొత్త జీవో ఇవ్వలేదని, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోనే తాము ఫాలో అవుతున్నామని స్పష్టం చేశారు. తాము ఇంకా అలాంటి జీవోనే ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చారు. అయితే, “మీరు జీవో ఇవ్వకుండానే అది బీఆర్ ఎస్ కు ఎలా వెళ్లింది?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… మంత్రి దీనిపై దాటవేశారు.
ఇంటి దొంగలెవరో తేల్చే పనిలో ప్రభుత్వం
ముసాయిదా దశలో ఉన్న అత్యంత గోప్యమైన జీవోలు ప్రతిపక్షానికి చేరుతుండటం ‘ఇంటి దొంగల’ పనే అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారు? కీలక దస్త్రాలు ఎలా బయటికి వెళ్తున్నాయ్? అనే అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం దృష్టి సారించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తమకు 5 లక్షల కోట్లు సంపాదించి పెట్టే జీవో ముందు గానే లీక్ అవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు.
లీక్ చేసిన వారెవరో త్వరలో పట్టుకొని తప్పకుండా శిక్షిస్తాం pic.twitter.com/cfTs6NyTxI
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2025