Ustaad Bhagat Singh: ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాలను పూర్తి చేసాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది, కానీ మిగిలిన నటీనటులకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది. ఈ నెలాఖరుకి మొత్తం షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మూడవ వారం లో ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని రీసెంట్ గానే ఆ చిత్ర నిర్మాత అధికారిక ప్రకటన చేసాడు.
ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా 2016 వ సంవత్సరం లో తమిళ హీరో విజయ్ నటించిన తేరి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోందని, స్టోరీ లో కొన్ని మార్పులు చేర్పులు చేసారని సోషల్ మీడియా లో ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. తేరి చిత్రాన్ని త్౫ఎలుగు లో ‘పోలీసోడు’ పేరు తో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. అంతే కాకుండా ఎన్నో సార్లు స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కూడా అయ్యింది. అలాంటి సినిమాని రీమేక్ చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇది రీమేక్ కాదని మరోసారి ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ముందుగా రీమేక్ సినిమా గానే ప్రారంభించాం. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేసి, ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. సినిమా ఎక్కడా కూడా రీమేక్ అనే ఫీలింగ్ ఇవ్వదు. హరీష్ శంకర్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు. ఓజీ సినిమా అభిమానులకు ఎలాంటి కిక్ ని ఇచ్చిందో, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అంతకు పది రేట్ల ఎక్కువ కిక్ ని ఇస్తుంది. సినిమా అంత బాగా వచ్చింది, కంటెంట్ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఏప్రిల్ మూడవ వారం లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు రవి శంకర్. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు గ్లింప్స్ వీడియోలు విడుదలయ్యాయి, మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. డిసెంబర్ 31 న మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.