GHMC Tea Powder Units: స్నేహితులతో కలిసి సరదాగా బయటకి వెళ్ళినప్పుడు.. తలనొప్పిగా ఉన్నప్పుడు.. మెదడు ఉత్సాహంగా పనిచేయాలి అనుకున్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలో టీ తాగడం మనకు అలవాటు. స్తోమతకు తగ్గట్టుగా టీ తయారు చేసుకొని తాగడం కూడా మనకు అలవాటే. అయితే ఇటీవల కాలంలో టీ వ్యాపారంలోకి పెద్ద పెద్ద కంపెనీలు ప్రవేశించాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలోని హైదరాబాద్ టీ వ్యాపారానికి గ్లోబల్ హబ్ గా మారింది. హైదరాబాదులో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కేఫ్ ఏకంగా 1000 రూపాయల విలువైన టీ కూడా విక్రయిస్తోంది. దీంతో యావత్ భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది.
టీ తాగడం వరకు బాగానే ఉంటుంది. కాని దానిని అధికంగా తాగితే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. బయట టీ తాగితే చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి ఉంటుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొంతకాలంగా నగరంలో వారు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని 42 టీ పౌడర్ యూనిట్లు.. టీ షాపులలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 19 చోట్ల నమూనాలు సేకరించారు. వాటిని ప్రయోగశాలకు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ.. శుభ్రతను పాటించే దుకాణంలో మాత్రమే టీ తాగాలని సూచించారు. స్వచ్ఛమైన టీ ఆకులు తడి వస్త్రంపై రుద్దితే రంగు వస్తుంది. ఆ రంగు అసలు పోదు. ఇక కల్తి టీ పౌడర్ నీటిలో కలిపితే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అటువంటి టీ పౌడర్ వాడితే ఆరోగ్యానికి హానికరమని” ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో వేలాదిగా టీ స్టాల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పొందినవి ఉన్నాయి. మిగతావన్నీ అనధికారికంగా నడుస్తున్నాయి. అయితే వీటిలో కల్తీ టీ పౌడర్ వేసి చాయ్ తయారు చేస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. అందువల్లే జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలలో భాగంగా రకరకాల నమూనాలు సేకరించారు. గతంలో తనిఖీలు నిర్వహించినప్పుడు కల్తీ టీ పౌడర్ ను అధికారులు గుర్తించారు. కొన్ని షాపులను సీజ్ కూడా చేశారు.. మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేపట్టారు. రకరకాల నమూనాలను సేకరించారు. ఏది ఏమైనప్పటికీ బయట టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అధికారులు చెబుతున్నారు.
Food Safety Drive by GHMC !!!
As part of the weekly special drive, GHMC Food Safety Officers inspected 42 Tea Powder units & Tea Points across the city on 04.09.2025.
✅ 19 samples sent to State Food Lab for analysis
✅ Vendors sensitized on hygiene & safety standards
⚠️ Action… pic.twitter.com/OSWVvLGqab— GHMC (@GHMCOnline) September 5, 2025