Gaddar: కమ్యూనిస్టు విప్లవ యోధుడు.. ‘ఆధ్యాత్మిక వాది’ ఎందుకయ్యాడు?

Gaddar: గద్దర్.. ఈ పేరు వింటేనే ఉద్యమానికి ఒక కొత్త రూపు.. ఆ పేరు చెబితేనే కమ్యూనిజానికి కొత్త ఊపు.. మావోయిస్టుగా మొదలైన ఆయన ప్రస్థానం ఆ తర్వాత వారి సానుభూతి పరుడిగా.. తెలంగాణ ఉద్యమ వీరుడిగా సాగింది. పోలీసుల లాఠీ దెబ్బలు తిని.. గన్ చేత బట్టి అడవుల్లో నక్సలైట్ గా దొరలను ఎదురించిన యోధుడు ఆయన.. నరనరాన కమ్యూనిజాన్ని .. నాస్తికవాదాన్ని మోస్తూ పెరిగాడాయన.. అలాంటి గద్దర్ నోట తాజాగా ఆధ్యాత్మిక పాట అందరినీ ఆశ్చర్యపరిచింది. […]

Written By: NARESH, Updated On : February 2, 2022 5:51 pm
Follow us on

Gaddar: గద్దర్.. ఈ పేరు వింటేనే ఉద్యమానికి ఒక కొత్త రూపు.. ఆ పేరు చెబితేనే కమ్యూనిజానికి కొత్త ఊపు.. మావోయిస్టుగా మొదలైన ఆయన ప్రస్థానం ఆ తర్వాత వారి సానుభూతి పరుడిగా.. తెలంగాణ ఉద్యమ వీరుడిగా సాగింది. పోలీసుల లాఠీ దెబ్బలు తిని.. గన్ చేత బట్టి అడవుల్లో నక్సలైట్ గా దొరలను ఎదురించిన యోధుడు ఆయన.. నరనరాన కమ్యూనిజాన్ని .. నాస్తికవాదాన్ని మోస్తూ పెరిగాడాయన.. అలాంటి గద్దర్ నోట తాజాగా ఆధ్యాత్మిక పాట అందరినీ ఆశ్చర్యపరిచింది. దైవభక్తిని అస్సలు తన జీవితంలోనే పాటించని గద్దర్ పూర్తిగా మారిపోయిన తన పంథా మార్చుకొని సమతామూర్తి ‘రామానుజం’పై ఒక పాట పాడడం అందరినీ షాక్ కు గురిచేసింది. గద్దర్ లో ఈ మార్పునకు కారణమేంటని అందరూ ఆరాతీస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో రామానుజ దివ్యక్షేత్రం నిర్మాణమైంది. ఆరేళ్లలో 216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం 1800 కిలోలతో తీర్చిదిద్దారు. చైనాలో 1600 భాగాలుగా తయారీ గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం 2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి,ప్రధాని.. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో కార్యక్రమం 5న మోదీ రానున్నారు. మహావిగ్రహ ఆవిష్కరణ చేసి జాతికి అంకితమివ్వనున్నారు. 13న రాష్ట్రపతి వస్తున్నారు. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్‌ దివ్య క్షేత్రం ముస్తాబైంది.ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు!

శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్పంతో ముచ్చింతల్‌ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మనదేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ వేడుక ప్రత్యేకంగా ఆధ్యాత్మిక వాడులు, పీఠాధిపతులు, బీజేపీ వాదులు, కేసీఆర్ లాంటి భక్తి ఎక్కువ ఉన్న నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. చినజీయర్ స్వామి చొరవతో వ్యాపారులు, నేతలు భాగస్వాములయ్యారు. అయితే ఈ వేడుకకు అసలు కమ్యూనిస్టు భావజాలం ఉన్న గద్దర్ పోలికనే లేదు. గద్దర్ కు భక్తికి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం.. రెండు విభిన్న ధృవాలుగా ఉంటారు.

అలాంటి గద్దర్ నోటా ‘రామానుజ’ పాటను పాడించి.. ఆ క్షేత్రం ప్రాముఖ్యతను వీడియోలో చూపించి ఫోకస్ చేశారు. గద్దర్ స్వయంగా రామానుజ గొప్పతనాన్ని పాటలో వీడియోలో వర్ణించాడు. ఇది చూసి నాస్తికవాదులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఈ వీడియోలో టీవీ9 యాంకర్ దీప్తి ఉండడంతో ఇది ఒక చానెల్ రూపొందించి ఉంటుందని.. ఆ చానెల్ అధినేత చినజీయర్ స్వామికి భక్తుడు కావడంతో ప్రమోషన్ వీడియో అయ్యింటుందని భావిస్తున్నారు. డబ్బుల కోసం గద్దర్ ఇలా విలువలు వదిలేసి పాట పాడాడా? లేక నిజంగానే కమ్యూనిజానికి తిలోదకాలిచ్చి ‘ఆధ్యాత్మికవాదిగా’ మారి వృద్ధాప్యంలో కృష్ణా రామా అంటున్నాడా? అన్నది వేచిచూడాలి.

కొసమెరుపు ఏంటంటే.. గద్దర్ మొదటిసారి ఆధ్యాత్మిక పాట పాడినా కూడా ఆయన చేతిలో.. భుజంపై ఎర్రజెండాను మరవకపోవడం విశేషం. దీంతో అసలు గద్దర్ కమ్యూనిస్టా? ఆధ్యాత్మికవాదినా? అన్న అనుమానాలు మరోసారి వచ్చాయి. కమ్యూనిజం వదిలేశాడని చెప్పలేం.. ఇలా భక్తిని ఎందుకు ప్రదర్శించాడన్నది మాత్రం అంతుబట్టని వ్యవహారంగా మారింది. 

-గద్దర్ పాడిన వీడియో ఇదే..